నెల్లూరు - తడ ఆరు లేన్ల ప్రతిపాదనేదీ లేదు?
ఎంపీ ఆదాలకు నితిన్ గడ్కరీ సమాధానం
నెల్లూరు నుంచి తడ వరకు జాతీయ రహదారిపై ఆరు లేన్ల విస్తరణ ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్సభలో రాతపూర్వకంగా తెలిపారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి తడ వరకు ఉన్న జాతీయ రహదారి విస్తరణ పై అడిగిన ప్రశ్నకు పై సమాధానాన్ని చెప్పారు. 2015లో సంభవించిన మెరుపు వరదల్లో దెబ్బతిన్న 2.82 కిలోమీటర్ల రహదారి పునరుద్ధరణ ఆరు లేన్ల విస్తరణ పనులు ఈపీసీ పద్ధతిలో చేయదలచామని తెలిపారు. ఈ పనులు గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు .2021 జూన్ 5వ తేదీలోగా ఈ పనులను పూర్తి చేయాలని గడువు నిర్దేశించినట్లు తెలిపారు.