నిర్లక్ష్యంగా సీసీ రోడ్డు నిర్మాణం. సీసీ రోడ్డు మధ్యలో స్తంభాలు
నిర్లక్ష్యంగా సీసీ రోడ్డు నిర్మాణం. సీసీ రోడ్డు మధ్యలో స్తంభాలు
సైదాపురం మండలం మేజర్ న్యూస్ :-
సైదాపురం మండల కేంద్రంలోని రాపూర్ క్రాస్ వద్ద నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు చేస్తున్నటువంటి సీసీ రోడ్డు పై విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమో,ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారుల,అలసత్వమో తెలియదు కానీ అధికారుల నిర్లక్ష్యానికి కాంట్రాక్టర్లు చేస్తున్న అభివృద్ధి పనులలో . సైదాపురం మండల పరిధిలోని రాపూర్, పొదలకూరు క్రాస్ రోడ్, నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు నిర్మిస్తున్న సిసి రోడ్డు మధ్య లో విద్యుత్ స్తంభాలు ఉన్నా అలాగే సీసీ రోడ్డును సదరు కాంట్రాక్టర్ వేసేశారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అభివృద్ధి ప నులు చేశామని చెప్పుకోవడానికి తూ తూ మంత్రంగా పనులు చేసేసి ఇలా స్తంభాలను రోడ్డు మధ్యలోనే వదిలివేయడాన్ని చూస్తుంటే అభివృద్ధి పనుల పై కాంట్రాక్టర్లకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఉన్న ఆసక్తి ఇట్టే తెలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా సఖ్యతగా చేయాలని, స్తంభాల ను పక్కకు జరిపి ఇబ్బందులు రాకుండా చూడాలని స్థానికులు. వాహన చో దకులు, కోరుతున్నారు.
రాపూరు పొదలకూరు క్రాస్ రోడ్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు
రెండు నెలల నుండి సిసి రోడ్ల నిర్మాణంలో కనిపించని ప్రభుత్వ అధికారుల జాడ, పనికి తీసుకువచ్చే మేస్త్రి వర్క్ ఇన్స్పెక్టర్లుగా, కాంట్రాక్టర్లే అధికారులుగా వ్యవహరిస్తున్నారు, గత ఐదు సంవత్సరాల పాలనలో నిర్వీర్యం చేసిన రోడ్డు పనులు కూటమీ ప్రభుత్వం ఏర్పడ్డాక పటిష్టంగా జరుగుతోందన తరుణంలో సీసీ రోడ్డుకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు జడ కనిపించకపోవడంతో గత నాలుగు ఐదు నెలలో వేసినటువంటి రోడ్డు కలెక్టర్ గ్రాండ్ ద్వారా రెండు కోట్ల రూపాయలతో సైదాపురం బ్రిడ్జి నుండి రాపూరు క్రాస్ రోడ్డు వరకు చేసినటువంటి రోడ్డు మూడునాల ముచ్చటగా తయారైందని, దీని పట్ల ఆర్ అండ్ బి అధికారులు ఎవరూ కూడా పట్టీ పట్టనట్లు ఎవరిస్తున్నారని అలాగే ప్రస్తుతం రాపూర్ క్రాస్ రోడ్డు నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు వేస్తున్నటువంటి సీసీ రోడ్డు హడావిడిగా వేస్తున్న తీరును గమనించిన వాహనదారులు స్థానికులు, ప్రభుత్వ అధికారులు దగ్గరుండి రోడ్లు ఏపిస్తేనే అంతంత మాత్రం రోడ్లు ఉంటున్నాయి అని 45 కోట్ల మేర కాంట్రాక్టు రోడ్డుపై ఏ అధికారి లేకపోవడంలో ఇది దేనికి సంకేతం అని వాహనదారులు మండల ప్రజలు మండిపడుతున్నారు