జర్నలిస్టులకు అండగా ఉంటా..   నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి భరోసా

 నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని కలిసిన కె వి సి జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు

 రాం కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు

 ఇంటి నివేశాన స్థలాలు కోసం రాం కుమార్ రెడ్డికి జర్నలిస్టులువినతిపత్రం

 స్పందించిన రాం కుమార్ రెడ్డి

త్వరలోనే జిల్లా కలెక్టర్ ను కలుస్తా

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా

జర్నలిస్టులకు రాంకుమార్ రెడ్డి భరోసా


 రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు ఆఫ్  డెవలప్మెంట్ చైర్మన్  నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని మంగళవారం వాకాడు లోని ఆయన స్వగృహంలో కోట, వాకాడు, చిట్టమూరు ( కె వి సీ) జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు, రాష్ట్ర ఎడ్యుకేషన్ బోర్డు ఆఫ్  డెవలప్మెంట్ చైర్మన్  నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి నియమితులైన సందర్భంగా జర్నలిస్టులు రాం కుమార్ రెడ్డికి  శాలువాలు కప్పి పుష్ప గుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.

 అనంతరం కోట, వాకాడు, చిట్టమూరు ( కె వి సీ) జర్నలిస్ట్ అసోసియేషన్ తరుపున రాం కుమార్ రెడ్డికి ఇంటి నివేశాన స్థలాలు కోసం వినతిపత్రం అందజేసి కోరారు, స్పందించిన రాం కుమార్ రెడ్డి త్వరలోనే జిల్లా కలెక్టర్ ను కలిసి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించే విధంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన జర్నలిస్టులకు భరోసా ఇచ్చారు.

 ఈ సందర్భంగా రాం కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పాను అని ఇప్పుడు అధికార పార్టీలో ఉండటం తనకు క్యాబ్ నెట్ హోదా పదవీ రావడం వల్ల అధికారులు తన మాట గౌరవిస్తారు అనీ అనుకుంటున్నాను,వీలైనంత తొందరగా జిల్లా కలెక్టర్ ను కలిసి జర్నలిస్టులు వారు కోరుకున్న చోట ఇప్పించేందుకు గట్టి ప్రయత్నం చేస్తాను అని ఆయన తెలిపారు.

 కోట, వాకాడు, చిట్టమూరు ( కె వి సీ) జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ  ఎన్నో ఏళ్లుగా జీతాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి వారధులు గా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటి వరకు ఇంటి స్థలాలు లేవు అనీ, అందువలన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని కలిసి కలిసి ఇంటి స్థలాలు ఇప్పించేందుకు సహాయం చేయాలి అని కోరడం జరిగింది అని, ఆయన కూడా జర్నలిస్టులకు భరోసా ఇచ్చారు అని, ఈ సందర్భంగా రాం కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు.

 ఈ కార్యక్రమంలోకోట, వాకాడు, చిట్టమూరు ( కె వి సీ) జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు మీజూరు మల్లికార్జున రావు, చంద్రగిరి బాల సుబ్రహ్మణ్యం, గొర్రె పాటి కోటయ్య, పురిణి మురళి, వంజివాక మోహన్, కుంచం కొండయ్య, మనపాటి మణి, సింగం శెట్టి మల్లికార్జున రావు, దాసి రాజేష్, పల్లాపు ప్రసాద్,పురిణి సుబ్రహ్మణ్యం, తీరుమలశెట్టి కోటేశ్వరరావు, ఉయ్యాల మనోహర్, పాశం ఏడుకొండలు, ఎంబెటీ పొలయ్య,మోరా రమణయ్య,అంపల్లి మురళి,కోట్లపూడి సుధాకర్,దాసరి సుందరం,కోడూరు రాము,షేక్ ఇంతియాజ్, పాలడుగు కిరణ్ కుమార్,చిన్న లింగం గారి మస్థానయ్య,మట్టిగుంట సురేంద్ర, దామా విజయ్ కుమార్,దేవారెడ్డి లక్ష్మీపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.