ఘనంగా నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి 87 వ జయంతి వేడుకలు
ఘనంగా నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి 87 వ జయంతి వేడుకలు
నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాకాడు,కోట, వెంకటగిరి, నెల్లూరులో జయంతి వేడుకలు
విద్యానగర్ లోని నేదురుమల్లి సుబ్బిరామి రెడ్డి కళాభవన్ లో రక్తదాన శిబిరం
400 మంది స్వచ్ఛంధంగా రక్త దానం
రక్తదానం చేసిన నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి
ఎన్ జి ఆర్ జయంతి సందర్భంగా భారీ కేక్ లు కట్ చేసి విస్తృతంగా సేవా కార్యక్రమాలు
ఎన్ జి ఆర్ తోనే ప్రగతి అడుగులు
సంక్షేమానికి చిరునామా జనార్ధన్ రెడ్డి
ప్రజల్లో గుండెల్లో ఆయనది చెరిగిపోని స్థానం
సైబర్ టవర్స్ సృష్టి కర్త నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి
తండ్రి బాటలోనే తనయుడు నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి
మరణించాక కూడా జనం గుండెల్లో బతికున్న ఎన్ జి ఆర్
మాటిస్తే నిలబెట్టుకోవాలి. హామీ ఇస్తే ఎలాగైనా అమలు చేయాలి. కష్టాన్ని కనిపెట్టి కన్నీరు తుడవాలి.. మహానేత నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి నేర్పినపాఠాలివి.ముఖ్యమంత్రిగా ఆయన అనుసరించిన విధానాలూ ఇవే. అందుకే మరణించాక కూడా ఆయన జనం గుండెల్లో బతికున్నారు. సంక్షేమానికి ఆయన పేరునే శాశ్వత చిరునామాగా మార్చేశారు. ఆయన తనయుడు కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్ట్ చైర్మన్ నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి 87వ జయంతి వేడుకలను ఆదివారం నేదురుమల్లి ఫౌండేషన్ ఆద్వర్యంలో వాకాడు,కోట, వెంకటగిరి, నెల్లూరు నగరంలోఘనంగా నిర్వహించారు. వాకాడు లోని నేదురుమల్లి స్వగృహ ప్రాంగణంలో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు, నేదురుమల్లి అభిమానులతో కలిసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. ముందుగా జనార్దన్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసిఘనంగానివాళులర్పించారు. అనంతరం జనార్ధన్ రెడ్డి 87 జయంతి కావడంతో 87 కెజిల కేక్ కట్ చేసి అభిమానం చాటారు.
కోట మండల విద్యానగర్ లోని నేదురుమల్లి సుబ్బిరామి రెడ్డి కళాభవన్ లో నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నేదురుమల్లి ఫౌండేషన్ చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గున్ని ప్రారంభించారు. ముందుగా జనార్ధన్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నెల్లూరుకు చెందిన రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రం, డీఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి రక్తినిధి కేంద్రం ప్రతినిధులు దాతల నుండి రక్తాన్ని సేకరించారు. సుమారు 400 మంది విద్యార్థులు, నేదురుమల్లి అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు స్వచ్చందంగా రక్తదానం చేసి ప్రాణదాతలు అయ్యారు.
అదేవిధంగా జనార్దన్ రెడ్డి తనయుడు ఎన్ బి కె ఆర్ విద్యా సంస్థలు కరస్పాండెంట్, కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్ట్ చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. అనంతరం కేక్ లు కట్ చేసి పలు సేవా కార్యక్రమాలునిర్వహించారు. ఈ సందర్భంగా వాకాడు సొసైటీ అద్యక్షులు కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూమహనీయులు పెద్దలు,పూజ్యలు దివంగత మహానేత డాక్టర్ నేదురుమల్లి జనార్ధన్ రెడ్డిజయంతినిపురస్కరించుకుని ప్రతి ఏటా రక్తదాన కార్యక్రమాలునిర్వహిస్తున్నామన్నారు. 2018, 19, 20లలో అత్యధికంగా రక్త యూనిట్లను సేకరించి, రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. గవర్నర్ చేతుల మీదుగా రాజ్ భవన్ లో అవార్డులను స్వీకరించినట్లు చెప్పారు.
సైబర్ టవర్స్ సృష్టికర్త నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి
సైబరాబాదు అని నేడు చెప్పుకునే ప్రాంతంలో ఐటీ పార్కుకి శంకుస్థాపన చేసింది నాటి కాంగ్రెసు పార్టీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని దామోదర్ రెడ్డి తెలిపారు. నాడు ప్రారంభించిన ఐటీ పార్కుకి రాజీవ్ గాంధీ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ అని నామకరణం చేయటం జరిగింది అన్నారు.అసలు దేశంలో ఐటీ కి పునాది వేసిందే రాజీవ్ గాంధీ నాడు శ్యామ్ పిట్రోడా సహయంతో కంప్యూటర్ టెక్నాలజీని భారతదేశంలోప్రవేశపెట్టినప్పుడు చాలామంది కార్మిక వర్గాలు, కమ్యూనిస్టులు బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు, దీనివలన నిరుద్యోగం పెరుగుతుంది అని. కానీ చివరికి దీని వలన నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం అయింది అని తెలిపారు.
తదనుగుణంగా జరిగిన మార్పులలో ఇన్ఫోసిస్, సత్యం, హేచ్.సి.యల్., యన్.ఐ.ఐ.టీ., లాంటి పలు సంస్థలు భారతదేశంలో ఏర్పడ్డాయి. బెంగుళూరు, మద్రాసు, బోంబాయి మొదలైన నగరాలుచాలా వేగంగా ఉద్యోగ కేంద్రాలుగా మారాయి. ఇందులో భాగంగానే రాజీవ్ గాంధీ ఐటీ పార్కు మాదాపూర్ లో వచ్చింది అని నేదురుమల్లి జయంతి సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో లెజెండ్ నేదురుమల్లి
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1935 ఫిబ్రవరి 20న వాకాడులో జన్మించి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కొంతకాలం వాకాడు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించి రాజ్యసభకు ఎన్నికయ్యారు . 1978లో రాష్ట్ర కాంగ్రెస్‌కు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై శాసనమండలికిఎన్నికయ్యారు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యుడిగా కూడా పనిచేశారు. రెడ్డి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేశారు, ముఖ్యమంత్రులు టి. అంజయ్య , భవనం వెంకట్రామ్ మరియు కోట్ల విజయభాస్కర రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు,ఆయన బాపట్ల నుండి ఒక్కొక్కటి చొప్పున మూడుసార్లు లోక్‌సభకుఎన్నికయ్యాడు(1998), నర్సరావుపేట (1999) మరియు విశాఖపట్నం (2004) నియోజకవర్గాలు. అతను విశాఖపట్నం నుండి కాంగ్రెస్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించాడు మరియు 1988లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశాడు.
1989లో రెవెన్యూ మంత్రిగా పని చేస్తూ చేన్నా రెడ్డి మంత్రివర్గంలో చేరాడు.
చేన్నరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత,జనార్దన్ రెడ్డి 1990లో ముఖ్యమంత్రి పదవినిఅధిరోహించారు.హైదరాబాద్‌లో మతపరమైన అల్లర్లు ఒక సవాలుగా మారాయి, తక్కువ సమయంలో ఈ ప్రాంతంలో శాంతిభద్రతలనుతీసుకొచ్చిన ఘనత జనార్ధన్ రెడ్డికే దక్కిందన్నారు. తీవ్రవాద నక్సలైట్ పీపుల్స్ వార్ గ్రూప్‌ను నిషేధించిన మొదటి ముఖ్యమంత్రి ఆయన కెరీర్‌లో ఒక ముఖ్యమైన నిర్ణయం వృత్తి విద్యను ప్రైవేటీకరించడం.ప్రైవేట్ రంగంలోని అనేక వైద్య మరియు ఇంజినీరింగ్ కళాశాలలుఅతనిపదవీకాలంలో పనిచేయడానికి అనుమతించబడ్డాయి.
కోట్ల విజయభాస్కర రెడ్డి అక్టోబరు 1992లో ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు.రెడ్డి గతంలో నిషేధించిన నక్సలైట్ తీవ్రవాద గ్రూపు సభ్యులు సెప్టెంబర్ 7, 2007న అతనిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. అతను తన కుటుంబంతో కలిసి తన స్వగ్రామమైన వాకాడుకు వెళుతుండగా ఈ ప్రయత్నం జరిగింది. ఈ సంఘటనలో అతని అనుచరులు ముగ్గురు మరణించినప్పటికీ, రెడ్డి మరియు అతని భార్య క్షేమంగా బయటపడ్డారు. రెడ్డి 2010లో మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు , అక్కడ ఆయన మరణించే వరకు పనిచేశారు. తన చివరి సంవత్సరాల్లో, రెడ్డి కాలేయ వ్యాధి మరియు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడ్డాడు . అతను దీర్ఘకాలంగా అనారోగ్యంతో 2014లో మరణించాడు.ఇలా అలుపెరగని రాజకీయాలు చేసిన జనార్ధన్ రెడ్డి రాజకీయాల్లో లెజెండ్ అయ్యారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మేరిగా మురళీధర్, వైసీపీ నేతలు పాపా రెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి, నేదురుమల్లి బాబీ రెడ్డి, దేవారెడ్డి నాగుర్ రెడ్డి, కల్లూరు భాస్కర్ రెడ్డి, వాకాడు జడ్పీటీసీ రౌతు రామకృష్ణ, వేమారెడ్డి షనీల్ రెడ్డి, భక్తవత్సల రెడ్డి,కృష్ణ చైతన్య,వెంకటేశ్వర్ల రెడ్డి,రాజా శేఖర్ రెడ్డి,రవి,వెంకట్, గోపాల్,చేవూరు నాగేశ్వర రావు, విజిల్ రెడ్డి, గురుస్వామి, ప్రసాద్ వైసీపీ నేతలు, కార్యకర్తలు, నేదురుమల్లిఅభిమానులు .
ఎన్ బీకేఆర్ విద్యా సంస్థల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, హేచ్ ఓ డి లు రవీంద్ర రెడ్డి, విక్రమ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, ఎన్ బి కె ఆర్ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, స్నేహితులు, బంధువులు, అభిమానులు పాల్గున్నారు.