ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి : బిజెపి రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి








నెల్లూరు నగరంలోని  సంతపేట మోడల్ ఆదర్శ ప్రభుత్వ పాఠశాల నందు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ,రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి మరియు సంతపేట మండల అధ్యక్షుడు భాస్కర్  ఆధ్వర్యంలో మోడల్ హై స్కూల్ నందు  ఆజాదిక అమృత్ మహోత్సవం వేడుకల్లో భాగంగా  హర్ ఘర్ తిరంగా యాత్రను 500 మంది విద్యార్థులతో స్కూలు ప్రాంగణం నుండి సంతపేట ములుముడి బస్టాండు మరియు గుప్తా పార్కు నారాయణ రావు పేట పరిసరాల్లో యాత్రను దేశభక్తి పరవశంతో ప్రతి ఇంటి పై జెండా ప్రతి పౌరుడు చేతిలో జెండా తో వందేమాతరం భారత్ మాతాకీ జై అనే నినాదాలతో  కొనసాగింది .సుశిక్షితులైన ఉపాధ్యాయులు క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు మరియు బిజెపి కార్యకర్తలు హర్ ఘర్ తిరంగా యాత్రను జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్ కుమార్ , మహిళా మోర్చా అధ్యక్షురాలు కరణం సుభాషిని, మహిళా మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంటా విజయ శ్రీ , మండల అధ్యక్షుడు చెంచులు రెడ్డి,చిన్న బజార్ పూర్వపు మండల అధ్యక్షులు మారేం కృష్ణ. బీజేవైఎం పూర్వపు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్,జిల్లా బిజెపి నాయకులు  ఇరిగేంద్ర, బిజెపి నాయకురాలు సిహెచ్ వి పద్మావతి. సుజాత బిజెపి నాయకురాలు ,ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు