నియోజకవర్గంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలి:-  ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ 







రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట :-


నియోజకవర్గంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవలు విజయశ్రీ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం

 సూళ్లూరుపేట పట్టణంలోని  హోలీ క్రాస్ సర్కిల్ నుంచి  ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించిన  హర్ ఘర్  తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా   సూళ్లూరుపేట  శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ  పాల్గొనడం జరిగినది, ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, స్వాతంత్రం ఎంతోమంది నాయకుల త్యాగఫలం మనకు వచ్చిందని, 78 సంవత్సరాల స్వతంత్ర భారతావని ఎంత అభివృద్ధి చెందిందని  తెలియజేశారు. అదేవిధంగా  పిల్లలకు చిన్నప్పటి నుంచే దేశభక్తి మీద అవగాహన కల్పించాలని, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. పై కార్యక్రమంలో  తిరుమూర్ సుధాకర్ రెడ్డి, ఆకుతోట రమేష్, ఆదినారాయణ రెడ్డి,పచ్చ మాధవ నాయుడు, ఏజీ కిషోర్,చిట్టేట్టి పెరుమాళ్, అలవల శ్రీనివాసులు,లోకేష్ నాయుడు,వాకిచర్ల రమేష్,శ్రీనివాసులు,చీమల దిన్నెరమణయ్య, అలీ,చెన్నం శ్రీనివాసులు వీరితోపాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.