వి ఎస్ యూ లో జాతీయ క్రీడా దినోత్సవం...




 

 వెంకటాచలం మేజర్ న్యూస్...


విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో క్రీడా దినోత్సవం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సంద ర్భంగా ఆయన చిత్రపటానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్.విజయభాస్కర రావు  మరియు రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత  పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి మాట్లాడుతూ1905 ఆగస్టు 29న ధ్యాన్‌చంద్ జన్మించారని హకీ ఆటలు మెరుపువేగంతో గోల్స్ చేయగల మాంత్రికుడిగా ఆయన క్రీడా చరిత్రలో సుస్థిర స్థానం సాధించారు. మైదానంలో పాదరసంలా కదిలిపోతూ బంతిని పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకోవడంలో ఆయనకు ఎవరూ సాటిరారని తెలిపారు.

1928 ఆమ్‌స్టర్‌డామ్,1932 లాస్ ఏంజిలెస్,1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు అందించిన ఘనత  మేజర్ ధ్యాన్‌చంద్‌‌కే దక్కింది. ధ్యాన్‌చంద్ నేతృత్వంలో భారత పురుషుల హాకీ జట్టు  మూడు సార్లు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పతకాలు గెలిచారు.

స్పోర్ట్స్ డే సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు విశ్వవిద్యాలయ ఉపకులపతి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్ విజయ, స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ ఎం.హనుమారెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.