అరవపాలెంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
అరవపాలెంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం.
రవి కిరణాలు న్యూస్
దేశ ప్రగతిలో శాస్త్ర,సాంకేతిక రంగాలు క్రియాశీలకంగా మారిన నేపథ్యంలో విద్యార్థులు పాఠశాల దశనుంచే ఆయా రంగాల వైపు ఆకర్షితులై బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అరవపాలెం శ్రీ సన్నారెడ్డి బాలకృష్ణారెడ్డి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టీ కామేశ్వరమ్మ తెలిపారు. బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.విద్యార్థులకు చిత్రలేఖనం,క్విజ్,వ్యాసరచన, వక్తృత్వ పోటీలు,సెమినార్లు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు.విద్యార్థులు రూపొందించిన సైన్సు ప్రాజెక్టులను ప్రదర్శించారు.విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేలా తయారుచేసిన పలుమోడల్స్ ఆకట్టుకోగా,సైన్స్ ఉపాధ్యాయులను అభినందించారు.వివిధ రకాల సైన్స్ కళాకృతులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్ విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టింది.సైన్స్ గీతాలపైవిద్యార్థులు ఆలపించిన గీతాలు,నృత్యాలు,నాటికలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.2023 -24 విద్యా సంవత్సరానికి గాను పాఠశాల నుంచి ఇన్స్పైర్ మనక్ కు ఎంపికైన ఏడవ తరగతి విద్యార్థి పి రోహిత