చిరమణ పీ హెచ్ సి పరిధిలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం 





అనుమసముద్రంపేట మేజర్ న్యూస్  ఏఎస్పేట మండలం చిరమణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోజాతీయ నులిపురుగుల నిర్మూలనదినోత్సవంకార్యక్రమాన్ని నిర్వహించారుఈ సందర్భంగా  పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ బి జ్యోతి రాణి డాక్టర్ కంచర్ల  నాగ వినూత లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో లో అన్ని పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలు, ఐటిఐ కళాశాల నందు కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేశారు  1-5 సంవత్సరం లోపు పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో నందు 6-19 పాఠశాలలు మరియు హైస్కూల్ లో విద్యార్థులకు ఆల్బెండజోల్ 400ఎంజి మాత్రలను అందజేసి మధ్యాహ్నం భోజనం తర్వాత ఆల్బెండజోల్ మాత్రను మింగించారు అలాగే పాఠశాలలకు రానటువంటి విద్యార్థులకు (ఆబ్సెంట్ ) పిల్లలకు ఈనెల  17వ తేదీన మాత్రలను అందజేస్తామనిఉపయోగించుకోవాలని తెలియజేసినారు చిరమణ పీహెచ్సీ పరిధిలో 1774 మంది గాను 1682 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించడం జరిగిందని 96 శాతం  పూర్తి చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు నులిపురుగుల వల్ల పిల్లల్లో జీవన నాణ్యత తగ్గి శారీరక ఎదుగుదల మానసిక ఎదుగుదల కుంటుపడుతుంది అని తెలిపారు ఇది పాఠశాలల్లో వారి హాజరును ప్రభావితం చేస్తుందని విద్యా భవిష్యత్తును దెబ్బతీస్తుందని అందువల్ల పిల్లలకు సకాలంలో సరైన నివారణ చర్యలు అవసరమని తెలిపారుఈకార్యక్రమంలో వైద్యాధికారిణి డాక్టర్ జ్యోతి రాణి డాక్టర్ కె నాగ వినూత, ఎంపీహెచ్ఈఓ షేక్  షఫీ, సూపర్వైజర్ వి, సలోమి, పాఠశాల ఉపాధ్యాయులు ఆరోగ్య కార్యకర్తలు   ఆశ కార్యకర్తలు, అంగన్ వాడి కార్యకర్తలు,పాల్గొన్నారు