సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు.






నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట: 

పట్టణంలోని తెలుగుదేశంపార్టీ కార్యాలయంనందు నేడు 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం విచ్చేశారు.పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్  ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం బారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం నెలవల సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ బాబు ఐటీ శాఖ మంత్రి గా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి అనేక కంపెనీలు తీసుకొచ్చారని వాటిలో నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కల్పించారని, ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పై కక్ష సాధింపులు చేపడుతుందని వాటిని త్వరలో ప్రజలు తిప్పికొడతారని హితవు పలికారు. తెలుగుదేశం నాయకుల పై కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.  ఈ కార్యక్రమంలో  పలువురు టీడీపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.