నారా లోకేష్ బాబు పాదయాత్ర షెడ్యూల్ ఖరారు... రవి కిరణాలు ప్రతినిధి కోట న్యూస్. 

తిరుపతి జిల్లా మైనారిటీ సెల్ ప్రధానకార్యదర్శి షేక్. జలీల్ అహ్మద్...

తెలుగుదేశం పార్టీ  జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర కోట మండల రూట్ మ్యాప్ ఖరారు అయినట్లు తిరుపతి జిల్లా మైనారిటీ సెల్ ప్రధానకార్యదర్శి షేక్. జలీల్ పేర్కొన్నారు. కోట పట్టణంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ  తెలుగుదేశం పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర జనవరిలో ప్రారంభించిన తిరుపతి జిల్లాలో జరుగుతుందని అన్నారు. ఈ యాత్ర చిట్టమూరు, వాకాడు మీదుగా కొనసాగి 27వ తేదీ సాయంత్రం కోట మండలం    రంగన్నగుంట గ్రామం వద్ద ప్రవేశిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకన్నపాలెం గ్రామం వద్ద నారా లోకేష్ బాబు కు ఘన స్వాగతం పలకనున్నట్లు జలీల్ భాషా పేర్కొన్నారు. 27వ సాయంత్రం మంగళవారం కోట గాంధి బొమ్మ వద్ద భారీ బహిరంగ సభ జరగనున్నట్టు తెలిపారు. అదే రోజు  రాత్రి  హరిహర రైస్ మిల్ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో  లోకేష్ బాబు విడిది చేయనున్నట్టు ఆయన తెలియజేశారు.  28వ తేదీ ఉదయం కోట అడ్డరోడ్డు నుంచి పాదయాత్ర మొదలై ప్రజా సమస్యలను తెలుసుకుంటూ   కొక్కుపాడు, ఉత్తమ నెల్లూరు, కర్లపూడి మీదుగా చిల్లకూరు మండలంలోనికి ప్రవేశిస్తుందని అన్నారు. కోట మండలంలో లోకేష్ పాదయాత్ర దాదాపు 14 కిలోమీటర్లు జరుగుతుందని,  ఈ పాదయాత్రలో కోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు,ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని, అన్నారు.