అంగరంగ వైభవంగా శ్రీ గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామి వారి గ్రామోత్సవం



శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. సూళ్లూరుపేట  :  పట్టణంలో రైల్వే స్టేషన్ వద్ద వెలసియున్న శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి గ్రామోత్సవము గురువారం రాత్రి  విద్యుత్ దీప, విశేష పుష్ప అలంకరణ,  బాణసంచా వేడుకలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

 స్థానిక శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య సారధ్యంలో చెన్నా రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి (స్వామి రెడ్డి) ఆధ్వర్యంలో మహా శివ రాత్రిని పురస్కరించుకొని ఐదు రోజుల పాటు ఆలయంలో  విశేష పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఛాంపియన్ చంద్రారెడ్డి, కాఫీ రెడ్డి దయాకర్ రెడ్డి, చంద్రమౌళి రెడ్డి, దయాకర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డిలు  గ్రామ పెద్దలు, భక్తులు భారీగా పాల్గొన్నారు.