దాదాపు 130 టన్నుల (2,500 బస్తాలు సుమారు) పై బడి రేషన్ బియ్యం,ఆరు లారీలతో సహా సీజ్ చేసి కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న si నాగార్జున్ రెడ్డి...

చిత్తూరు జిల్లా సత్యవేడు లో గత కొన్ని రోజులుగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టిన si కి సత్యవేడు మండలం లో ఓ చోట రేషన్ బియ్యం పట్టుబడడంతో ఎలా సేకరిస్తారు ,ఎక్కడికి తరలిస్తారనే కోణంలో విచారణ చేపట్టిన si కి విచారణలో నెల్లూరు జిల్లా తడ మండల కేంద్రం లోని ఓ గోడౌన్ కి తరలిస్తున్నట్లు విచారణలో తెలగా  సినీ ఫక్కీలో ఒకటికి రెండు సార్లు తడలో అక్రమ నిల్వ ప్రాంతాల్లో తిరిగి పక్క సమాచారం సేకరించి జిల్లా sp ఆదేశాలతో అర్ధరాత్రి సమయంలో దాడులు చేసి దాదాపు 130 టన్నుల కు పైగా రేషన్ బియ్యాన్ని,6 లారీలతో సహా స్వాధీనం చేసుకొని కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం...(వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది)...

ఈ దాడులు si నాగార్జున రెడ్డి కేవలం ఇద్దరు సిబందితో కలిసి నిర్వహించడం కొసమెరుపు

కాగా 

మరోవైపు దళారులు కొంతమంది లబ్ధిదారుల వద్ద తక్కువ ధరకు సేకరించి రేషన్ మాఫియాకు అందిస్తే  వారు బియ్యాన్ని పాలిష్ చేసి చెన్నై,నెల్లూరు జిల్లా లకు తరలించి సొమ్ము చేసుకుంటు లక్షలకు పడగలెత్తుతున్నారనే సమాచారం...
ఈ ముఠా నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు సరిహద్దుల్లో ఉన్న తమిళనాడుకు కూడా విస్తరించి ఉన్నారనే సమాచారం...

ఏది ఏమైనా
సులువైన మార్గంలో డబ్బులు సంపాదించే క్రమంలో మాఫియా అవతారం ఎత్తి చట్టవ్యతిరేకమైన ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతూ విలాసవంతమైన జీవితనికి అలవాటు పడ్డ మాఫియాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కొంతమంది కోరుతున్న...మరోవైపు రేషన్ మాఫియాకు సహకరిస్తూ వివిధ మార్గాలలో లబ్ధిదారుల వద్ద సేకరించిన బియ్యాన్ని తరలిస్తూ దళారుగా మారి తమ జీవితాలు నాశనం చేసుకోవద్దంటు...రేషన్ బియ్యాన్ని తరలించిన ,నిల్వ ఉంచిన చట్టపరమైన చర్యలు తప్పవని SI నాగార్జున్ రెడ్డి హెచ్చరించారు...