కావలి పట్టణం ముసునూరు ప్రాంతంలో తీరని అవమానం ...కార్యనిర్వాహక కార్యదర్శి బిల్లు. చెంచురామయ్య
July 20, 2020
billu chenchu raiah
,
gudur
,
Nellore
,
NTR
,
tdp
మాట్లాడుతూ..
👉తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అద్యక్షులు, సమైక్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగువారి ఖ్యాతిని దసదిశాలకు వ్యాపింపజేసి, తెలుగువారిని మదరాసి అనే దగ్గర నుండి ఆంధ్రులుగా గుర్తింపు తెచ్చిన మహా నేత స్వర్గీయనందమూరి.తారకరామారావు గారికి నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరు ప్రాంతంలో తీరని అవమానం జరిగిందని అన్నారు.
👉2018 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా.లోకేష్ గారి చేతుల మీదుగా ముసునూరు గ్రామంలో NTR గారి విగ్రహన్ని అక్కడి రామారావు గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసి ఏర్పాటు చేయడం జరిగింది.
👉దానిని చూసి ఓర్వలేని YSRCP నాయకుల కనుసన్నలలో వారి కార్యకర్తల అధ్వర్యంలో JCB పెట్టి అయన విగ్రహాన్ని తొలగించి, దిన్నెతో సహా ద్వసం చేయడాన్ని, గూడూరు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
👉దేశంలోనే మొట్ట మొదటగా సంక్షేమ పథకాలకి బాటలు వేసి BC/SC/ST లకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించినటువంటి మహానబావుడు NTR గారు.
👉అదే విదముగా తెలంగాణ లో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి ఆంద్ర, రాయల సీమలో ఉన్నటువంటి మున్సీబ్, కరణం ల వ్యవస్థను రద్దు చేసి మండలాల వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు పరిపాలన సౌలభ్యం కలిపించిన మహానుభావుడు.
👉అదేవిదముగా ఆడపడుచులకు ఆస్తిలో హక్కు కల్పించి , ఆడపడుచుల తోటే అన్న అనిపించుకున్న మహానుభావుని విగ్రహంను తొలగించడం సిగ్గు చేటు అన్నారు.
👉ఇకనైనా ఎవరైతే దానిని ద్వoశం చేసారో వారిపై కటిన చర్యలు తీసుకుని, తొలగించిన చోటే NTR గారి విగ్రహమును పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గం కార్యాలయ ఇంచార్జ్ పరిమళ.రాజేష్, TNSF జిల్లా కార్యదర్శి వెంకటేష్, నాయకులు గౌతమ్ , గిరి,శ్రీను,చాణిక్య , దీపక్ తదితరులు పాల్గొన్నారు.