జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఎన్సీడీసీడీ




జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఎన్సీడీసీడీ 3.O మీద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు పట్టణ ఆరోగ్య కేంద్రం  వైద్యాధికారులకు సమీక్ష సమావేశం స్టేట్ ఎన్సిడి సిడి  నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ శ్యామల వారు నిర్వహించినారు.  వీరు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము సిడిఎన్సిడి 3.0  సర్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా  తీసుకుందని, ఏఎన్ఎం,ఆశ & సిహెచ్ఓ ఒక టీం గా ఏర్పడి ప్రతిరోజు తప్పనిసరిగా ఐదు ఇల్లు సర్వే పూర్తి చేయాలని, ఆయా ఇళ్లల్లో 18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరిని తప్పనిసరిగా పరీక్ష చేయవలెను అని వైద్యాధికారులు ఆదేశించారు. ఎన్సిడి సిడి 3.0 లో క్యాన్సర్ స్క్రీనింగ్, మెంటల్ హెల్త్ ని  కొత్తగా యాడ్ చేయటం జరిగిందని, క్యాన్సర్  స్క్రీనింగ్ ని ఇంత భారీ స్థాయిలో  దేశంలో చేస్తుంది ఒక్క ఆంధ్రప్రదేశ్ అని, దేశ మొత్తము ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని, కావున ఎన్సిడి సిడి 3.O సర్వే సంఖ్యాపరంగానే కాకుండా గుణాత్మకంగా కూడా చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు