రాళ్లపాడు రైతుల పంటకు నీరు అందించే బాధ్యత నాది ఎమ్మెల్యే ఇంటూరి








 రాళ్లపాడు ప్రాజెక్టు చివరి ఆయకట్టు  వరకు నీరు అందిస్తాం


 సోమశిల ప్రాజెక్ట్ నుంచి రావలసిన 1.5 టీఎంసీ లు నీటిని త్వరగతిన రాళ్లపాడు ప్రాజెక్టుకు చేర్చే బాధ్యత నాది.. 


లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు ఆయకట్టు రైతులతో ఈరోజు అనగా శుక్రవారం ఉదయం 11 గంటలకు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు మరియు అధికారులు కలిసి సమావేశం నిర్వహించారు..


ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ప్రాజెక్టులో ప్రస్తుతం 19 అడుగుల నీరు ఉందని, ఆయకట్టు కింద ఉన్న రైతులు నారుమళ్లకు నీరు విడుదల చేయుటకు అధికారులతో చర్చించి తేదీ నిర్ణయిస్తామని తెలిపారు.. ఈ సీజన్లో రాళ్లపాడు ప్రాజెక్టు కింద ప్రతి రైతు పొలానికి నీరు అందించే బాధ్యతను తీసుకుంటానని తెలిపారు..


సోమశిల ప్రాజెక్టు నుంచి రాళ్లపాడు ప్రాజెక్టు కేటాయించిన 1.5 టిఎంసి నీరు కచ్చితంగా ప్రాజెక్టుకు చేరేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు..


రైతులు అందరి సహకారంతో గత ఐదేళ్లలో సాగుకు నోచుకోని ఆయకట్టు రైతు పొలాలకు కూటమి ప్రభుత్వంలో నీరు అందించి వరి పంట పండించేందుకు మరియు రైతులు కళ్ళల్లో ఆనందం చూసేందుకు కృషి చేస్తానని తెలిపారు..


గత ప్రభుత్వంలో ప్రాజెక్టు వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, సోమశిల నుంచి మనకు రావాల్సిన నీటి వాటాను కూడా సక్రమంగా ప్రాజెక్టుకు తీసుకురాలేకపోయారని, ప్రాజెక్టుపై సరైన పర్యవేక్షణ లేక ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని కనీసం కాలువల్లో పూడిక కూడా తీయలేకపోయారని విమర్శించారు..


కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు మరియు జిల్లాకు చెందిన మంత్రుల సహకారంతో ప్రాజెక్ట్ నిర్వహణకు  36 లక్షల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగిందని, ప్రస్తుతం రాళ్లపాడు ఎడమ, కుడి కాలువలలో పూడిక మరియు జంగిల్ క్లియరెన్స్ పనులు రెండు రోజుల్లో పూర్తవుతాయని  తెలిపారు.. ప్రస్తుతం ప్రాజెక్టు పర్యవేక్షణకు 8 మంది లస్కర్ లను నియమించడం జరిగిందని తెలిపారు.


సోమశిల ప్రాజెక్టు నుంచి మనకు రావాల్సిన వాటా 1.5 టిఎంసి నీటిని ప్రాజెక్టుకు నింపే బాధ్యతను  సోదరుడు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి సహకారంతో ఉత్తర కాలువపై ఎటువంటి అడ్డంకులు లేకుండా త్వరగతిన ప్రాజెక్టుకు నీరు చేరే విధంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే గారు తెలిపారు.. సోమశిల ప్రాజెక్ట్  నుంచి రాళ్లపాడు ప్రాజెక్ట్ కు నీరు చేరే ఉత్తర కాలువపై అధికారులు ఎప్పటికప్పుడు పరివేక్షిస్తూ ప్రాజెక్టుకు రోజుకు ఎంత మొత్తంలో నీరు చేరుతుందో వివరాలను తమకు తెలపాలని ఎమ్మెల్యే గారు అధికారులు సూచించారు..


కందుకూరు నియోజకవర్గం వర్షాదారిత ప్రాంతం కావడంతో  ప్రాంతం కావడంతో త్రాగు, సాగు నీరు ఇబ్బంది లేకుండా వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి మన ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రాళ్లపాడు ప్రాజెక్టుకు నీరు వచ్చేలా ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే గారు తెలిపారు..