ర్యాలీ నిర్వహించిన ముస్లిం మైనార్టీలు.
ర్యాలీ నిర్వహించిన ముస్లిం మైనార్టీలు.
కేంద్ర ప్రభుత్వంపై ముస్లిం మైనార్టీలు ఆగ్రహం.
తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత.
ముత్తుకూరు ,సెప్టెంబర్ 6( మేజర్ న్యూస్) కేంద్ర ప్రభుత్వంపై ముత్తుకూరు మండలం ముస్లిం మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వక్ప్ చట్టంలో సవరణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీలు శుక్రవారం మండల కేంద్రంలో ఆందోళన వ్యక్తం చేస్తూ బస్టాండ్ సెంటర్ నుండి రెవెన్యూ కార్యాలయం వరకు వందలాదిమంది ముస్లిం మైనార్టీ సోదరులు ర్యాలీ చేశారు. ప్ల కార్డులు చేత పట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై నిరసన చూపారు. తదుపరి రెవెన్యూ శాఖ అధికారులకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. తాసిల్దార్ బాలకృష్ణారెడ్డి తో మాట్లాడి విషయం చెప్పారు. ముస్లిం మైనార్టీల డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు.