రైల్వే రోడ్డులో ఆక్రమణను తొలగించిన మున్సిపల్ అధికారులు
రైల్వే రోడ్డులో ఆక్రమణను తొలగించిన మున్సిపల్ అధికారులు
కావలి మేజర్ న్యూస్: కావలి పట్టణంలో స్థానిక రైల్వే రోడ్డు గీతా మందిరం సమీపంలో కబడ్డీ షాపును ఆక్రమించుకొని వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా ఆక్రమణ అని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు దీన్ని మంగళవారం తొలగించడం జరిగినది. అయితే ఎన్నో సంవత్సరం నుండి ఈ షాప్ పెట్టుకుని వ్యాపార లావాదేవులు జరుపుతున్నారని ఈ స్థల యజమాని వైసిపి నాయకులు కనుమర్లపూడి వెంకట్ నారాయణ తెలిపారు. ఈ స్థలానికి సంబంధించిన స్టే ఆర్డర్ కాగితాలు ఉన్నాయని ఈ స్థలము నాది అని చెప్పినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు అది మున్సిపల్ స్థలమని తొలగించడం జరిగినది.