సూళ్లూరుపేట డంపింగ్ యార్డ్ లో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చిన మున్సిపల్ మరియు ఫైర్ సిబ్బంది
సూళ్లూరుపేట డంపింగ్ యార్డ్ లో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చిన మున్సిపల్ మరియు ఫైర్ సిబ్బంది
రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
సూళ్లూరుపేట సమీపం లోని జాతీయ రహదారి పక్కనే ఉన్న పురపాలక చెత్త నిల్వ కేంద్రంలో ప్రమాదవశాత్తు మంగళవారం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న
సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ్య మున్సిపల్ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని
ఫైర్ సిబ్బందికి, హైవే సిబ్బందికి మరియు షార్ సిబ్బంది కి తెలిపి వారి యొక్క ఫైర్ ఇంజన్ తో మరియు మున్సిపల్ వాటర్ ట్యాంకర్ కి మోటార్లు అమర్చి నీరు చల్లడం ద్వారా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పొగను కూడా ఒకటి రొండు రోజులలో పూర్తిగా అదుపులోకి వస్తుందని మరియు జెసిబి సహాయంతో కాలిన చెత్తను వేరు చేసి ఫైర్, హైవే మరియు షార్ సిబ్బంది సహాయ సహకారంతో త్వరితగతిన మంటలు అదుపులోకి వచ్చిందని వారికి మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ్య ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ డంపింగ్ యార్డ్ సమస్యను ప్రభుత్వానికి మరియు పై అధికారుల దృష్టికి తెలపడంతో డంపింగ్ యార్డ్ కు ప్రభుత్వ భూమిని కేటాయించి వెంటనే డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ్య తెలిపారు.