వేధించే వారికి గుణపాఠం చెప్పండి
ముంబయి: బాలీవుడ్‌లో తన సత్తా చాటుతున్న సినీనటి సన్నిలియోనీ మహిళలకోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సందేశం ఇచ్చారు. వేధించే వారికి తక్షణం గుణపాఠం చెప్పాలని మహిళలకు పిలుపునిచ్చారు. మౌనంగా ఉంటే మహిళలు మరింత ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చునని ఆమె హెచ్చరించారు. పనివేళల్లో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తెలియచేసేలా ఉన్న ఈ వీడియో సన్నీలియోనీ ఓ సంస్థలో పనిచేసే అధికారిలా కనిపించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ..పనిచేసే చోటా వేధింపులను తట్టుకోవడం చాలా కష్టం అన్నారు. ఇలాంటి వాటిపై మౌనంగా ఉండకండి అని సన్నీలియోనీ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సన్నీలియోనీ కోకో కోలా సినిమాలో నటిస్తున్నారు. హర్రర్ విత్ కామెడీతో తెరకెక్కుతున్న కోకో కోలా చిత్రం షూటింగ్‌లో ఆమె బిజీగా ఉన్నారు.