వక్ఫ్ చట్ట సవరణలు ఆపకపోతే  రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం





- ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు  సుభహాన్

నెల్లూరు కలెక్టరేట్ ( మేజర్ న్యూస్ )


వక్ఫ్ చట్ట సవరణలు ఆపకపోతే అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎ సుభహాన్ తెలిపారు. ఆవాజ్ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని  గాంధీ బొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు వక్ఫ్ బోర్డు చట్ట సవరణలను వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం అక్కడకు వచ్చిన మైనారిటీలను ఉద్దేశించి  ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎ సుభహాన్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల నుంచి అభివృద్ధికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. వక్ఫ్ చట్ట సవరణ లతో  మైనారిటీల అభివృద్ధి కోసమే ఈ చట్ట సవరణలు గొప్పలకు పోతున్నారని ఉన్న చట్టాలను అమలు చేస్తే చాలన్నారు. ఇప్పుడు కొత్తగా 40 చట్ట సవరణలు తీసుకుని వక్ఫ్ బోర్డు ని నిర్వీర్యం చేయడం తప్ప ఇంకొకటి లేదన్నారు. మత స్వేచ్ఛకు ఈ చట్ట సవరణలు విగాతం కలిగిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న పార్టీలు కూడా మైనారిటీలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కూడా చట్టసవరంలకు మద్దతు తెలిపితే కచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఆవాజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతాం అన్నారు. ఆవాజ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ రఫీ మాట్లాడుతూ జిల్లాలో చాలా భూములు అన్ని ప్రాంతం అయి ఉన్నాయని వాటికి రక్షణ కంచెలు ఏర్పాటు చేయాల్సిన అవసరం  ఉందన్నారు. మైనారిటీ నాయకులు జియా ఉల్ హాక్ మాట్లాడుతూ పార్లమెంట్లో చట్ట సవరణలు తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అక్రమంలో చాలా ఉన్నాయి వాటిని తక్షణ వక్ఫ్ అధికారులు స్వాధీన పంచుకోవాలని అన్నారు.  ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ను, వక్ఫ్ ఆస్తులను  కాపాడుకోవడం ప్రతి ముస్లిం  కర్తవ్యం అన్నారు. అనంతరం ఆవాజ్ ఆధ్వర్యంలో వక్ఫ్ చట్ట సవరణలు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి యజాన్, జిల్లా కమిటీ సభ్యులు షేక్ రియాజ్, షేక్ నజీర్ భాష, షేక్ నాయబ్, షేక్ చాన్  బాషా, సయ్యద్ అన్సర్, షేక్ ఫయాజ్, షేక్ మునీర్ భాష, మైనారిటీ నాయకులు నవీద్, మౌలానా అజీజ్, ఆసిఫ్ బాషా తదితరులు పాల్గొన్నారు.