మోటార్ సైకిళ్ల దొంగల అరెస్టు 






* రూ.5.95 లక్షల  సొత్తు స్వాధీనం 

* ఎస్పీ కృష్ణ కాంత్ 

 నెల్లూరు క్రైమ్ (మేజర్ న్యూస్)

మారుతాళ్ళలతో  మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు. మంగళవారం పోలీస్ కవాతు విధానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దర్గా మిట్ట సిఐ ఎం రోశయ్య ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిఘా ఉంచగా శబరి శ్రీరామ క్షేత్ర o సమీపంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నంకు చెందిన  కర్పూరం శివరామకృష్ణారెడ్డి, నెల్లూరు భక్తవత్సల నగర్ కి చెందిన శ్రావణ్ కుమార్ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.5.95 లక్షలు విలువ చేసే15 మోటార్ సైకిళ్ల ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. దర్గామిట్ట, చిన్న బజారు, వేదాయపాలెం, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలలో దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ రోశయ్య, ఎస్సై రమేష్, సిబ్బందిని అభినందించి వారికి ప్రశంస పత్రాలను అందజేశారు.