పాఠశాల ఆకస్మిక చేసిన ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి
పాఠశాల ఆకస్మిక చేసిన ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి
విద్యా ప్రమాణాలు చాలా బావున్నాయి మిడ్ డే మిల్స్ నిర్వహణ బావుంది
నెల్లూరు [బుచ్చిరెడ్డిపాలెం], రవికిరణాలు ఏప్రిల్ 10 : బుచ్చిరెడ్డి పాళెంపట్టణ పరిధిలోని రామచంద్రాపురం ప్రాధమికొన్నత పాఠశాలను ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజమురళిఆకస్మిక తనిఖీ చేశారు.విద్యార్థుల హాజరు, బోధన సంబంధ విషయాలపై అధ్యాపకులతో మాట్లాడారు. మిడ్ డే మిల్స్ నిర్వహణ పై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న విద్యా సంవత్సరలో హైస్కూల్ గా అప్ గ్రేడ్ కానున్న రామచంద్రాపురం అప్పర్ ప్రైమరి స్కూల్ కావాల్సిన అదనపు వసతుల గురించి ఉపాధ్యాయులతోచర్చించారు. విద్యా బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం రామచంద్రాపురం లో స్థానిక కౌన్సిలర్ కత్తి శ్రీదేవితో కలిసి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డుల పంపిణి చేశారు.ఈ కార్యక్రమలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెంచలయ్య,సునీల్, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.