పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ప్రతి మాసం పర్యవేక్షించాలి

 రవికిరణాలు ప్రతినిధి - దొరవారిసత్రం  న్యూస్:-

 ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం సాగిస్తున్న విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై డాక్టర్ పళని రాజ్ ఆరా తీశారు. శనివారం వెదురు పట్టు గ్రామంలో జరిగిన విలేజ్ డాక్టర్ క్లినిక్ లో ఆ గ్రామంలోని మధుమేహం, రక్తపోటు రోగగ్రస్తులను పరిశీలించి పలు సూచనలు చేసి, మందులు వాడుకునే విధానం తెలియజేశారు. రోగం తగ్గాలంటే మందులు ఒక్కటే సరిపోవని, మన ఆహార నియమాలు ఆరోగ్య సూత్రాలు పాటించాలని వారికి బోధించారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు వారి ఆరోగ్యం పై పలు సూచనలు చేశారు. ప్రతినెలా వైద్యుని పరీక్ష తప్పనిసరి అని  సూచించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో ఎదుగుదల, మానసిక పరిపక్వత, ఏవైనా లోపాలు ఉన్నాయనే పరీక్షించారు. ఆరోగ్య సిబ్బంది ప్రతి మాసంలో ప్రభుత్వ పాఠశాలలోని  విద్యార్థుల్లో ఆరోగ్య పరీక్షలు చేపట్టాలని, ఏవైనా లోపాలు గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. వెదురుపట్టు, వెదురుపట్టు రాజుపాలెం అంగన్వాడీ కేంద్రాలను కూడా అతనికి చేసి పిల్లల ఎత్తు బరువులు పరిశీలించారు. కేంద్రంలో తప్పనిసరిగా ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, ఐరన్ మాత్రలు, ఐరన్ సిరప్ స్టాక్ ఉండాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కిరణ్, ఎం ఎల్ హెచ్ పి  పావని, ఏఎన్ఎం  అమరావతి, హెల్త్ అసిస్టెంట్  సుధాకర్, ఆశ కార్యకర్తలు  సుజాత, ప్రబల కుమారి, అంగన్వాడీ కార్యకర్తలు  ఝాన్సీ, మాధురి పాఠశాల హెచ్ఎం, డీఈఓ శివ  తదితరులు పాల్గొన్నారు.