ఆత్మకూరు నియోజకవర్గ స్థాయి జలవనరుల శాఖ ప్రాజెక్టులపై  పరిశ్రమల శాఖ మంత్రి సమీక్ష

ఆత్మకూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లిలో మంత్రి మేకపాటి అధ్యక్షతన సమీక్షా సమావేశం   సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్1,2 పనులపై మంత్రి ఆరా  ఫేజ్ 1 పనులు 62 శాతం పూర్తయినట్లు వెల్లడించిన ఆత్మకూరు ఆర్డీవో చైత్ర వర్షిణి

                              

భూసేకరణలో జాప్యం మంత్రి అసహనం  హైలెవల్ కెనాల్ మెట్ట ప్రాంత ప్రజల కల, ఆశ  చిన్ని కారణాలతో పనులు మందగించినా, నిలిచినా సహించబోను : మంత్రి మేకపాటి  ఎన్ని అడ్డంకులొచ్చినా అధిగమిస్తాం..మెట్ట ప్రాంతాన్ని మాగాణిగా మార్చి తీరుతాం  దసరా కల్లా భూసేకరణ ప్రక్రియ  పూర్తి చేసి..పనులు పట్టాలెక్కించాలని ఇరిగేషన్ అధికారులకు మంత్రి ఆదేశం  చుక్కల భూముల సేకరణ 80శాతం పూర్తయిందన్న అధికారులు 500 ఎకరాలలో 400 ఎకరాలు సేకరించినట్లు మంత్రికి వివరించిన ఆర్డీవో  2 రోజులలో మిగతా డాటెడ్ ల్యాండ్ ప్రక్రియ పూర్తి చేస్తామన్న అధికారులు  భూ సేకరణకు సంబంధించిన నష్టపరిహారం, రైతుల సమస్యలపై వివరాలడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి ప్రభుత్వం, జలవనరుల శాఖ నుంచి అవసరమైన అనుమతులు వెంటనే తెప్పిస్తానని స్పష్టం చేసిన మంత్రి మేకపాటి  నాయుడుపల్లిలో భూసేకరణకు రైతులు స్వచ్చంధంగా ముందుకు రావడం లేదని తెలిపిన ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్

10వ తేదీన నాయుడుపల్లి రైతులను పిలిపించి భూసేకరణకు ఒప్పిస్తామని, ప్రభుత్వం నుంచి వారికి భరోసా అందిస్తామన్న మంత్రి గౌతమ్ రెడ్డి  ఏ.ఎస్ పేట, ఆత్మకూరు, మర్రిపాడు, చేజర్లలోని 13 ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి మేకపాటి ఆదేశం  అక్టోబర్ ఆఖరికి ఫేజ్ 2 భూ సేకరణ పూర్తి చేస్తామని మంత్రికి తెలిపిన ఆర్డీవో  ఇరిగేషన్ శాఖపై మంత్రి మేకపాటి అధ్యక్షతన జరిగిన సమీక్షలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ గణేష్, ఆర్డీవో చైత్ర వర్షిణి, సోమశిల ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్, తెలుగుగంగ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సువర్ణమ్మ, ఎంపీడీవో సుష్మిత,  మర్రిపాడు జడ్పీటీసీ మల్లు సుధాకర్ రెడ్డి,  చేజర్ల జడ్పీటీసీ పార్థ సారధి, మర్రిపాడు ఎంపీపీ గంగవరపు లక్ష్మీదేవి, మర్రిపాడు ఎంపీటీసీ పెనగలూరు  ఓబులమ్మ , బ్రాహ్మణపల్లి సర్పంచ్ ఓబులేషు, తదితరులు