తండ్రి ప్రధమ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కాకాణి....

                  దివంగత మహానేత.. తోడేరు పెద్దాయన.. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తండ్రి కాకాణి రమణారెడ్డి ప్రథమ వర్ధంతి వేడుకలు  ఆయన స్వగ్రామమైన పొదలకూరు మండలం తోడేరు లో మంగళవారం జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి కాకాణి తన కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు.  ఉదయం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఆయన తండ్రి కాకాణి రమణారెడ్డి ఘాట్ వద్దకు చేరుకొని పూలమాలవేసి నివాళులర్పించారు. కాకాణి రమణారెడ్డి గత ఏడాది మే నెల 7 వ తేదీన దివంగతులయ్యారు. తెలుగు  తిథుల ప్రకారం మంగళవారం  వర్ధంతి కావడంతో ఈ వేడుకలను జరిపారు. మండలంలోని పలువురు ప్రజా ప్రతినిధులు,అధికారులు, కాకాణి అభిమానులు రమణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.