"NABARD క్రెడిట్ ప్లాన్ విడుదల చేసిన మంత్రి కాకాణి"

విజయవాడ:

తేది:09-03-2023
విజయవాడ నగరంలోని ఫార్చ్యూన్ మురళి పార్క్ హోటల్ లో నాబార్డ్ 2లక్షల 86 వేల కోట్ల రూపాయలతో రూపొందించిన "నాబార్డ్ క్రెడిట్ ప్లాన్" ను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు

కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి గారు, స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్ కాటమనేని భాస్కర్ గారు, APMIDC మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి గారు,  NABARD చీఫ్ జనరల్ మేనేజర్ యం.ఆర్.గోపాల్ గారు, సహకార శాఖ కమీషనర్ ఏ.బాబు గారు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ నవనీత్ కుమార్ గారు, NABARD జనరల్ మేనేజర్ జయఖన్నన్ గారు,  APCOB మేనేజింగ్ డైరెక్టర్ డా౹౹ఆర్.శ్రీనాథ్ రెడ్డి గారు, NABARD అధికారులు, సీనియర్ బ్యాంక్ అధికారులు, తదితరులు.

 నాబార్డ్, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 2 లక్షల 86వేల కోట్లతో క్రెడిట్ ప్లాన్ సిద్ధం చేసినందుకు ధన్యవాదాలు. ఆర్థిక సంవత్సరం 2023 - 24 కు సంబంధించి, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు అత్యధికంగా 1,82,000 కోట్ల రూపాయలు కేటాయించడం ఆహ్వానించదగిన పరిణామం. నాబార్డ్ 1,35,000 కోట్ల పంట రుణాల కోసం మరియు 47,307 కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించడం సంతోషకరం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు, వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి,  అన్నదాతలకు అన్ని విధాల అండగా నిలుస్తున్నారు. వ్యవసాయ అభివృద్ధిలో పంటలు పండించడంతో పాటు, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రధానమైన అంశం. రైతులు పండించిన పంటలకు విలువలను జోడిస్తే, వ్యవసాయం, రైతులకు లాభసాటిగా మారుతుందనడంలో సందేహం లేదు. రైతుల ఆదాయం పెరగాలంటే, పంటకు విలువలు జోడించేందుకు అనువుగా బ్యాంకులు సహాయం అందించేందుకు ముందుకు రావాలి. గిట్టుబాటు ధర, వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ ఉంచుకునేందుకు వసతి సదుపాయాలు, రవాణా సౌకర్యాలు కల్పిస్తే వ్యవసాయ ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు  పెట్టేందుకు ముందుకు వచ్చే వ్యవసాయక పారిశ్రామికవేత్తలను బ్యాంకులు ప్రోత్సహించాలి.

 చిన్న, సన్నకారు రైతుల ధాన్యాన్ని సేకరించేందుకు వ్యవసాయ ఉత్పత్తి సంస్థలు (FARMER PRODUCER ORGANISATION) ఏర్పాటు చేసేందుకు బ్యాంకులు సహకారాన్ని అందించాలి. వ్యవసాయ ఉత్పత్తి సంస్థలు రైతుల ఉత్పత్తులను సేకరించేందుకు అనువైన మౌలిక వసతులకు పెట్టుబడుల కోసం బ్యాంకులు ఉదారంగా రుణాలు మంజూరు చేయాలి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో నాబార్డ్ పాత్ర కీలకం. వ్యవసాయ రంగంతో పాటు, గ్రామీణాభివృద్ధి రంగంలో కూడా నాబార్డ్ అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయం. గడిచిన ఆర్థిక సంవత్సరం కన్నా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 13 శాతం అధికంగా 2లక్షల 86 వేల కోట్ల విలువైన క్రెడిట్ ప్లాన్ సిద్ధం చేసిన నాబార్డ్ అధికారులకు నా ధన్యవాదాలు.