జాతీయస్థాయి స్కేటింగ్ క్రీడ పతక విజేతకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సత్కారం


ఇటీవల చండీగఢ్ లో జరిగిన జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలలో జిల్లా స్కేటింగ్ క్రీడాకారుడు యస్ శ్రీహర్షకుమార్ రెడ్డి అండర్ 14 వయస్సు డౌన్ హిల్ ఈవెంట్ నందు రజిత పతకం సాధించడం జరిగింది. ఈ రోజు జిల్లా మంత్రివర్యులు పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పతక విజేత శ్రీహర్షకుమార్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.  జిల్లాకు మొట్టమొదటి సారిగా ఈ ఈవెంట్ నందు పతకం రావడం చాలా సంతోషదాయకమని, అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్, సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ కార్యదర్శి నిమ్మల వీర వెంకటేశ్వర్లు, స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి గుర్రం ఈశ్వర్, సభ్యులు కందుకూరు రమేష్, కోచ్ లు జితేంద్ర, జావేద్, భరత్, విశ్వనాథ్, షోకాత్ తదితరులు పాల్గొన్నారు.