ఆర్ ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం .
ఆర్ ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం .
బోగోలు మేజర్ న్యూస్:-
బోగోలు మండలం కడనూతల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఫౌండర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయిన రామిరెడ్డి సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పివిఎన్ రెడ్డి తెలిపారు. ఈ శిబిరం నెల్లూరు నారాయణ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఎన్ ఎస్ ఎస్ వారి సహాయ సహకారాలతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ రోజు శిబిరం నందు 147 మంది రక్తమును దానం చేసినట్లు వారు తెలిపారు. ఇప్పటివరకు కళాశాలలో 47 శిబిరాలు నిర్వహించి 2495 బ్యాగులను రక్తం దానం చేసినట్లు తెలిపారు.శిబిరం నందు ప్రత్యేకత ఏమంటే ప్రస్తుత కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ వి రమణారెడ్డి కూడా రక్తం దానం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం కన్నా మిన్న అని, ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న వారు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ వి రమణారెడ్డి, అన్ని విభాగాల అధిపతులు, నారాయణ హాస్పిటల్ డాక్టర్ గారైన డాక్టర్ ఏ. యసువర్ధన్ వారి సిబ్బంది మరియు ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఏ. కిరణ్ కుమార్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.