అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమై వ్యవసాయ శాఖ కార్యక్రమాల ప్రగతిని సమీక్షిస్తున్న రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార,  మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యవసాయ శాఖ కార్యక్రమాలు ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా  రైతులకు అందజేస్తున్న సేవలను మంత్రి కి వివరిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ  కమిషనర్ చేవూరి హరి కిరణ్.
రైతుల సమస్యల పరిష్కారం కొరకు ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ కి అందే ప్రతి సమస్య ను పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆదేశించిన మంత్రి.
రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య, రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ సుస్మిత  తో పాటు వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు, సహాయ సంచాలకులు తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గన్నారు.