డెవలప్మెంట్ ఆఫీసర్ లను సంఘీభావం తెలియచేయవలసినదిగా
October 11, 2022
dharma
,
lic
,
Meeting
,
Nellore
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలం, వరిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్ జ్వరాలు, అంటువ్యాధులపై - డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశ వాలంటీర్లు, ఇంజనీరింగ్ అధికారులు, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
👉 జ్వరాల సీజన్ మొదలైనందున ఆరోగ్య కేంద్రాలలోని వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.
👉 పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు చేపట్టాలి.
👉 గ్రామీణ నీటి సరఫరా అధికారులు సైడ్ డ్రైన్లు పొర్లకుండా, గ్రామాలలో మురికి నీరు నిల్వ ఉండకుండా పంచాయతీ సిబ్బందికి సూచనలు ఇవ్వాలి.
👉 అధికారులు సమన్వయంతో పనిచేసి దోమలను నిర్మూలించి, ప్రజలు జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
👉 గ్రామ స్థాయి సిబ్బంది గ్రామాలలో ప్రతి ఇంటిని పరిశీలిస్తూ, దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలి.
👉 డెంగ్యూ, మలేరియా లాంటి విషజ్వరాల బారినపడే వారికి తక్షణ చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలి.
👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైయస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా 2434 వ్యాధులకు వైద్యం అందిస్తున్నారు.
👉 ఆరోగ్యశ్రీ ద్వారా జ్వరాలు నయం చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెసలుబాటు కల్పించారు.
👉 విష జ్వరాల బారిన పడి లక్షలు వెచ్చించవలసి వస్తున్న పేద, బడుగు వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు జ్వరాలను ఆరోగ్యశ్రీ కింద చేర్చడం ఎంతో ఉపకరిస్తుంది.
👉 కరోనా మూడో విడత సంకేతాల నేపథ్యంలో అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలి.
👉కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి 100 శాతం లక్ష్యాన్ని ఛేదించాలి.
👉 అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోండి.
కోవిడ్ మహమ్మారి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. కోవిడ్ 19 కి సంబంధించి మూడవ వేవ్ కి తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు సంబంధించి భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జిల్లాలో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ద్వారా జరుగుతున్న పనులను ముమ్మరం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, జాయింట్ కలెక్టర్ లు గణేష్ కుమార్, బాపి రెడ్డి , విదేహ్ ఖరే , జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజ్య లక్ష్మి, డిపిఓ ధనలక్ష్మి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రోజ్ మండ్, డ్వామా పిడి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు
అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమానికి మ్యుఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నెల 11వ తేదీన నెల్లూరుకు విచ్చేయుచున్న సందర్భంగా నెల్లూరు నగరంలోని మహేశ్వరీ కళ్యాణ మండపం నందు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో రాష్ట్ర జలవనరుల శాఖ
ఎంత చేసినా పులివెందుల రుణం తీర్చుకోలేను
నాపై ఆప్యాయత చూపించడంలో ఏరోజూ తక్కువ చేయలేదు
రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం
రూ.3115 కోట్లతో గండికోట-సీబీఆర్, గండికోట-పైడిపాలెం స్కీమ్‌కు శంకుస్థాపన
రూ.1256 కోట్లతో 1.38 లక్షల ఎకరాలు మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి
గతేడాది చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి బాగుంది
కరువు ప్రాంతం మనది.. నీటి విలువ తెలిసిన మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు
రూ.668 కోట్లు ఆర్‌అండ్‌ఆర్ ఇచ్చి గండికోటలో 26.85 టీఎంసీల నీరు నిల్వచేశాం
రూ.240 కోట్లు ఆర్‌అండ్‌ఆర్ ఇచ్చి చిత్రావతిలో 10.13 టీఎంసీలు నింపాం
‘‘పులివెందుల ప్రాంతానికి ఎంత చేసినా రుణం తీర్చుకోను.
ఇక్కడ ప్రజలు సొంత బిడ్డలా నాపై ఆప్యాయత చూపించడంలో ఏ రోజూ తక్కువ చేయలేదు.
ఇక్కడి ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని గట్టిగా చెబుతున్నా’’ అని సీఎం జగనన్న గారు అన్నారు.
ఈరోజు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో పులివెందుల నియోజకవర్గంలో మరో రూ.5 వేల కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నాను అని సీఎం జగనన్న గారు చెప్పారు.
రూ.668 కోట్లు ఆర్‌అండ్‌ఆర్ కింద ఇచ్చి గతంలో 12 టీఎంసీలు దాటని గండికోట రిజర్వాయర్‌లో 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేశామన్నారు.
అదే విధంగా రూ.240 కోట్లు ఆర్‌అండ్‌ఆర్‌కు కేటాయించి గతంలో 5 టీఎంసీలు మించి నిల్వ ఉండని చిత్రావతిలో 10.13 టీఎంసీల నీటిని నిల్వ చేశామని చెప్పారు.
కరువు ప్రాంతం మనది. నీళ్ల విలువ తెలిసిన మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడని చెప్పారు.
ప్రస్తుతం సుమారు రూ.5 కోట్ల పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు గత సంవత్సరం చేసిన పనుల పురోగతిని కూడా పులివెందుల నియోజకవర్గ ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం జగనన్న గారు ఏం మాట్లాడారంటే
గత సంవత్సరం డిసెంబర్ 25న వైయస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశానని గర్వంగా చెబుతున్నాను. రూ.500 కోట్లతో పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాల కోసం భూసేకరణ ప్రక్రియ పూర్తిచేశాం.
టెండర్లు పిలవడం కూడా జరిగింది. రివర్స్‌టెండరింగ్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా పూర్తిచేసి ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తాం.
33/11కేవీ 5 విద్యుత్ సబ్‌స్టేషన్లకు దాని ద్వారా 10 గ్రామాల్లోని 2100 వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు, 10200 గృహ విద్యుత్ సర్వీసులకు క్వాలిటీ పవర్ అందించేందుకు గత సంవత్సరం శంకుస్థాపన చేశాం.
ఈ రోజు ఆ సబ్‌స్టేషన్ల పనులు పూర్తయ్యాయి.
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కోమనూతల, ఎగువపల్లి, తాతిరెడ్డిపల్లి, దిగువపల్లి, మారర్‌చింతల, అంబకపల్లి, ఎర్రబల్లి చెరువుల్లో నీటిని నింపడంతో పాటు వేముల మండలంలోని యూసీఐఎల్ ప్రభావిత 7 గ్రామాలకు సాగునీరు, తాగునీరు సరఫరా కోసం సర్పేస్ వాటర్ ద్వారా చిత్రావతి నుంచి నీరు అందించే కార్యక్రమానికి గత ఏడాది శంకుస్థాపన చేశాం.
ఆ పనులకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు పూర్తిచేశాం. అడ్మినిస్ట్రేషన్ అనుమతులు పూర్తిచేశాం.. జ్యుడిషియల్ ప్రివ్యూ కూడా పూర్తి అయ్యింది. టెండర్లు పిలుస్తున్నాం.
టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి మాసంలో పనులు కూడా ప్రారంభిస్తాం.
పులివెందుల మున్సిపాలిటీలో 57 కిలోమీటర్లకు సంబంధించి భూగర్భ డ్రైనేజీ సిస్టమ్,
142 కిలోమీటర్ల మేర తాగునీటి సరఫరా పైపులైన్ ఏర్పాటుకు గతేడాది శంకుస్థాపన చేశాం. పనులు జరుగుతున్నాయి.
జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీల్లో పులివెందుల నందు లెక్చరర్ కాంప్లెక్స్ కార్యక్రమానికి శంకుస్థాపన చేశాం.
టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరిలో వీటి పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది.
వేంపల్లెలో కొత్త డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన చేశాం. ఆ కళాశాల తాత్కాలిక భవనాలతో ప్రారంభించడం జరిగింది.
టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి మార్చి నాటికి భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.
పులివెందుల నియోజకవర్గంలో 7 మార్కెటింగ్ గిడ్డంగుల ఏర్పాటు. పులివెందుల, సింహాద్రిపురం మార్కెట్ యార్డుల్లో మౌలిక వసతుల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.
పనుల పురోగతి చాలా బాగుంది.
పులివెందులలో ఇంటిగ్రేటెడ్ ప్యాక్‌హౌస్, ప్రీకూలర్, కోల్డ్‌స్టోరేజ్‌కు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. పనుల పురోగతి చాలా బాగుంది.
నల్లచెరువు పల్లె గ్రామంలో 132 కేవీ సబ్‌స్టేషన్లు. దీని ద్వారా 14 గ్రామాలకు మంచి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పనులు జరుగుతున్నాయి. పనుల పురోగతి చక్కగా ఉంది.
ఆర్‌అండ్‌బీకి సంబంధించి నూలివీడు, పందికుంట, కొల్లకుంట రోడ్డు విస్తరణకు చేపట్టిన పనులు జరుగుతున్నాయి. పనుల పురోగతి చక్కగా ఉంది.
పులివెందులలో ఏరియా ఆస్పత్రి అభివృద్ధి, వేంపల్లెలో కమ్యూనిటీ హెల్త్ ఆస్పత్రిని 30 పడకల నుంచి 50 పడకల ఆస్పత్రికి పెంచడం. ఈ రెండు పనులకు గతేడాది శంకుస్థాపన చేశాం.
ఈ రెండు పనులు జరుగుతున్నాయి. పనుల పురోగతి చక్కగా ఉంది.
గతేడాది శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు జరుగుతున్నాయి. మంచిపురోగతి కూడా ఉందని తెలియజేస్తున్నాను.
ఇడుపులపాయలో పర్యాటక సర్క్యూట్, వైయస్‌ఆర్ మెమోరియల్ గార్డెన్స్ అభివృద్ధికి సంబంధించి 2019లో శంకుస్థాపన చేశాం.
టూరిజం పనులు జరుగుతున్నాయి. పనుల పురోగతి కూడా చక్కగా ఉంది.
నియోజకవర్గంలో 51 దేవాలయాల పునరుద్ధరణ, 18 కొత్త దేవాలయాల నిర్మాణం పనులు చక్కగా జరుగుతున్నాయి.
పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్‌కు సంబంధించి పులివెందులలో మినీ సచివాలయం నిర్మాణం పనులు జరుగుతున్నాయి.
వేంపల్లెలో నూతన ఉర్దూ జూనియర్ కాలేజీ నిర్మాణానికి గతేడాది శంకుస్థాపన చేశాం. ఆ పనుల పురోగతి బాగుంది.
పులివెందుల టౌన్‌లో మోడల్ పోలీస్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశాం. ఈ పనులు చక్కగా జరుగుతున్నాయి. పురోగతి బాగుంది.
ఈ రోజు శంకుస్థాపన చేసిన పనులు
గండికోట నుంచి 40 రోజుల్లో చిత్రావతి, పైడిపాలెం జలాశయాలు నింపేందుకు రూ.3 వేల కోట్లతో నూతనంగా లిఫ్ట్ స్కీమ్‌ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం. ఈ పథకం ద్వారా మరో 2 వేల క్యూసెక్కులు పెరిగి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు రోజుకు 4 వేల క్యూసెక్కులు అందుతాయి.
పైడిపాలెం జలాశయానికి 2 వేల క్యూసెక్కులకు పెంచుతూ శంకుస్థాపన చేస్తున్నాం. వీటికి సంబంధించిన జ్యుడిషియల్ ప్రివ్యూ కూడా పూర్తయింది. ఈనెల 26న టెండర్లను అప్లోడ్ చేస్తాం. మార్చినాటికి పనులు కూడా ప్రారంభం అవుతాయి.
పులివెందుల బ్రాంచ్ కెనాల్, సీబీఆర్ కుడి కాల్వ, జీకేఎల్‌ఐకి సంబంధించిన 1.38 లక్షల ఎకరాల భూమిని పులివెందులలో రూ.1256 కోట్లతో మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకువస్తున్నాం.
జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తయింది. 26వ తేదీన టెండర్లు అప్లోడ్ చేస్తాం.. మార్చి నాటికి పనులు ప్రారంభం అవుతాయి.
రెండు ప్రాజెక్టులకు రూ.4300 ఖర్చు చేయబోతున్నాం. ఇరిగేషన్ మీద ఇంత ధ్యాస పెడుతున్నామంటే.. కరువు ప్రాంతం మనది.
నీళ్ల విలువ తెలిసిన మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు. శ్రీశైలంలో దేవుడి ఆశీస్సులతో పుష్కలంగా నీరు ఉంది.
గత రికార్డులు చూస్తే తగ్గుతూపోతున్న పరిస్థితులు. మన డ్యామ్‌ల కెపాసిటీలో నీళ్లు త్వరగా చేరితేనే మనం బతకగలుగుతాం.
40 రోజులు శ్రీశైలం నీళ్లు పూర్తి స్థాయిలో ఉంటే మన డ్యామ్‌లు పూర్తిగా నిండిపోతాయి. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం.
రూ.34.20 కోట్లతో 12 ఎకరాల విస్తీర్ణంలో పులివెందులలో నూతన బస్‌స్టేషన్, డిపో కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించిన మూడు పనులు ఉన్నాయి. ప్రహరీ నిర్మాణం ఇప్పటికే జరుగుతున్నాయి. బస్ డిపోకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. డిసెంబర్ 25వ తేదీన పనులు కూడా ప్రారంభించబడతాయి.
బస్ స్టేషన్‌కు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మార్చి నాటికి పనులు ప్రారంభిస్తాం.
14.5 కోట్లతో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవీరాంజనేయస్వామి దేవస్థానం నందు ప్రధాన గర్భాలయం, మండపం పునర్నిర్మాణ పనులకు సంబంధించి శంకుస్థాపన చేశాం.
టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మార్చి నాటికి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని ఆదేశాలిచ్చాం.
పులివెందుల పట్టణంలోని శ్రీరంగనాథస్వామి, మిట్ట మల్లేశ్వరస్వామి ఆలయాలు, అంకాలమ్మ గుడి, తూర్పు ఆంజనేయస్వామి దేవస్థానాలకు సంబంధించి రూ.3.26 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టమని ఆదేశాలిచ్చాం.
ఫిబ్రవరిలో పనులు మొదలవుతాయి.
బాలికలకు అత్యుత్తమ విద్య, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌కు సంబంధించి తొండూరులో నూతన భవనం నిర్మించేందుకు రూ.36 కోట్లు మంజూరు చేశాం.
టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి.. ఏప్రిల్, మే మాసం కల్లా పనులు ప్రారంభం అవుతాయి.
పులివెందుల నియోజకవర్గంలో గ్రామాల అనుసంధానం కొరకు 292 కిలోమీటర్ల మేర 76 బీటీ రోడ్లు నిర్మించేందుకు రూ.184 కోట్లు మంజూరు చేయడం జరిగింది.
టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి ఏప్రిల్, మే మాసం కల్లా పనులు ప్రారంభించడం జరుగుతుంది.
రూ.29.70 కోట్లతో నియోజకవర్గంలో దెబ్బతిన్న 29 రోడ్లు 74 కిలోమీటర్ల మేర మరమ్మతు పనులు జరుగుతున్నాయి. టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పిలవడం జరిగింది. కొన్ని చోట్ల పనులు మొదలయ్యాయి. మిగిలిన చోట్ల ఫిబ్రవరి మాసంలో చేపడుతారు.
నియోజకవర్గంలో బాగా దెబ్బతిన్న 23 ఆర్‌అండ్‌బీ రోడ్లను రూ.56.85 కోట్లతో 219 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయడం కూడా జరుగుతుంది.
టెండర్లు ప్రక్రియ పూర్తిచేసి జనవరి 31 నాటికి పనులు ప్రారంభిస్తాం.
ప్రస్తుతం ఉన్న 3.75 మీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్లను 7 మీటర్ల వెడల్పు చేయడం, రూ. 11.5 కోట్లతో కుప్పం–కళ్లూరుపల్లె రోడ్డు 8.2 కిలోమీటర్ల మేర వెడల్పు చేయడం.
ఇది కాకుండా రూ.5 కోట్లతో సురభి–కుప్పం రోడ్డు 4 కిలోమీటర్ల మేర వెడల్పు చేయడం, రూ.8 కోట్లతో ప్రముఖ పుణ్యక్షేత్రం మోపూరి దేవాలయాలకు రోడ్లను 6.03 కిలోమీటర్ల మేర వెడల్పు చేయడానికి శ్రీకారం చుడుతున్నాం.
రూ.7 కోట్లతో చిన్నరంగాపురం – నెడెళ్ల రోడ్డును 5 కిలోమీటర్ల మేర వెడల్పు చేయడానికి శ్రీకారం చుడుతున్నాం. టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి మార్చి నాటికి పనులు ప్రారంభం అవుతాయి.
రూ.8.90 కోట్లతో ప్రముఖ పుణ్యక్షేత్రం మోపూరి భైరవేశ్వరస్వామి దేవాలయం నందు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాం.
చిత్రావతి జలాశయం వద్ద టూరిజం సౌకర్యాలు కల్పించడం కోసం రూ.5.6 కోట్లతో శంకుస్థాపన చేశాం.
పైడిపాలెం జలాశయం వద్ద టూరిజం సౌకర్యాలను పెంపొందించేందుకు రూ.5 కోట్లతో శంకుస్థాపన చేశాం.
పులివెందులలో ప్రస్తుతం ఉన్న శిల్పారామం నందు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు రూ.12.26 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాం.
మెడికల్ అండ్ హెల్త్, పోలీస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్, సబ్ స్టేషన్ల నిర్మాణం, చక్రాయపేట, నాగులగుట్టపల్లె గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, సింహాద్రిపురం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.14 కోట్లు కేటాయించడం వంటి పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది.
18 నెలల్లో జరిగిన గొప్ప కార్యక్రమం జరిగింది. జిల్లాలోనే అతిపెద్ద ప్రాజెక్టు గండికోట రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ వల్ల కొన్ని లక్షల ఎకరాలకు నీరు, రైతులకు మేలు జరిగే కార్యక్రమం ఉంది.
గండికోటలో 12 టీఎంసీల నీరు మించి ఎక్కువగా నిల్వ ఉన్న పరిస్థితులు లేవు. గండికోట రిజర్వాయర్ కెపాసిటీ 26.85 టీఎంసీలు అయితే 12 టీఎంసీలు దాటి నింపని పరిస్థితి ఎప్పుడూ ఉండేది. గండికోట ప్రాజెక్టుకు సంబంధించి అక్షరాల రూ.668 కోట్లు ఆర్‌అండ్‌ఆర్ కింద డబ్బులు ఇచ్చి... 2020 డిసెంబర్ 21వ తేదీన అక్షరాల 26.85 టీఎంసీల నీరు నింపగలిగాం.
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిస్థితి మనకు తెలుసు. చిత్రావతిలో గతంలో 5 టీఎంసీల నీరు కూడా నింపని పరిస్థితి.
ఈ రోజు అదే చిత్రావతిలో రూ.240 కోట్లు ఆర్‌అండ్‌ఆర్ కింద ఇచ్చి 10.13 టీఎంసీల నీరు నిల్వ చేశాం.
మనం అధికారంలోకి వచ్చి 18 నెలలు. 12 టీఎంసీల దాటి నింపని రిజర్వాయర్‌లలో నీరు 27 టీఎంసీలు ఎందుకు నింపలేకపోతున్నామని అడిగే పరిస్థితి నుంచి..
18 నెలల కాలంలో రైతులకు మంచి చేయాలనే చిత్తశుద్ధితో దాదాపు రూ.1000 కోట్లు ఆర్‌అండ్‌ఆర్‌కు కేటాయించి నీరు నింపి చూపించాం.
రైతులపై ఉన్న ప్రేమకు ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. గండికోట, చిత్రావతి నిర్వాసితులకు చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
మీ బిడ్డ పొరపాటున ఏదైనా తప్పు చేసి ఉంటే మన్నించమని కోరుకుంటున్నాను. ఆర్‌అండ్‌ఆర్ కోసం గ్రామాలను ఖాళీ చేశారో.. వారికి మంచి చేయాలని కలెక్టర్‌ను కోరుతున్నాను
నెల్లూరు నగరంలోని
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డి.పి.ఓ శ్రీమతి ధనలక్ష్మి మాట్లాడుతూ.., ప్రస్తుతం 20 వెనుక బడిన గ్రామాలను ఎంపిక చేశామని, డిసెంబర్ 31వ తేదీ లోపు మిగిలిన జిల్లాలోని అన్ని గ్రామాల స్థితిగతులను, వెనుకబాటు తనాన్ని పరిశీలించి మిగిలిన 120 గ్రామాలను కూడా ఎంపిక చేసి.., పరిశ్రమల శాఖ జి.ఎం. ద్వారా అందిస్తామని తెలిపారు. ప్రధానంగా శానిటైజేషన్, మెడికల్ విభాగం, గ్రామాభివృద్ధిలో సి.ఎస్.ఆర్ ద్వారా.., సంస్థ నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టవచ్చన్నారు. మనం-మన పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చేపట్టామని, దానిలో భాగంగా డస్టు బిన్స్, మొక్కల పెంపకం, డ్రైనేజ్ సిస్టం అభివృద్ధి, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల అభివృద్ధి, పి.హెచ్.సి ల్లో మెడికల్ పరికరాల కల్పనలోనూ, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు, ఆట స్థలాల అభివృద్ధి, ప్రతిభ కలిగిన క్రీడాకారులకు కోచ్ ల ద్వారా మెరుగైన శిక్షణ అందించడం, పశువుల వసతి గృహాలు, గ్రంథాలయాల నిర్మాణం, ఆర్.ఓ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు, గ్రామాల్లో రహదారుల అభివృద్ధి, చెత్త తరలించడానికి ఈ-ఆటోస్, ట్రై సైకిల్స్ పంపిణీతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయి.., మోడల్ విలేజ్ లుగా తయారు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేయాలని డి.పి.ఓ. కోరారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు శిక్షణ అందించడంలోనూ, ఆధునిక వ్యవసాయ పద్దతుల్లో అవగాహన కల్పించడంలోనూ భాగస్వామ్యులు కూడా కావొచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో DIC జి.ఎం. శ్రీ ప్రసాద్, పరిశ్రమల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ సమీక్ష సమావేశం..
కేడర్ కు దిశానిర్దేశనం చేసిన మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పత్తిపాటి పుల్లరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు నరసింహయాదవ్, రైతు విభాగం అధ్యక్షుడు రాధాక్రిష్ణమనాయుడు, రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, కుంకాల దశరధనాగేంద్ర ప్రసాద్, మేదరమెట్ల కోదండరామ నాయుడు, అన్ని మండలాల నాయకులు..
పార్టీ నూతన మండల అధ్యక్షులుగా సన్నారెడ్డి సురేష్ రెడ్డి(తోటపల్లి గూడూరు), పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి(ముత్తుకూరు), గుమ్మడి రాజాయాదవ్(వెంకటాచలం), గాలి రామక్రిష్ణారెడ్డి(మనుబోలు), తలచీరు మస్తాన్ బాబు(పొదలకూరు)ని నియమిస్తున్నట్టు ప్రకటించిన సోమిరెడ్డి..వైసీపీ నేతల అవినీతి, అరాచకం, అన్యాయాలు, దోపిడీతో ప్రజలు పూర్తిస్థాయిలో విసుగుచెందుతున్నారు..
రైతు పండించిన ధాన్యం ధర కంటే ఏట్లో దొరికే ఇసుక ధర ఎక్కువగా ఉన్న పరిస్థితి వైసీపీ పాలనలో నెలకొంది..
ఉచితంగా లభించే ఇసుకకు ప్రభుత్వం నిర్ణయించిన రూ.1,600 ధర, ట్రాక్టర్ బాడుగ కన్నా వైసీపీ నేతలు తమకు ఓట్లేసిన ప్రజలపై అదనంగా విధిస్తున్న మూడింతల సుంకమే భారంగా మారింది...
ఒక్క విరువూరు ఇసుక రీచ్ నుంచే పెద్దరెడ్డి సొంత ఖజానాకు నెలకు రూ.40 లక్షలు జమవుతున్నాయి..
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వైసీపీ నేతలతో కలిచి ఇసుక రీచ్ అక్రమాల్లో భాగస్వాములవడంతో పరిపాలన ప్రశ్నార్థకంగా మారింది...
గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన పాపానికి జనంపై పన్నుల మీద పన్నులు వేస్తున్నారు..
నిత్యావసర వస్తువుల ధరల నుంచి లిక్కర్ రేట్లు వరకు అన్నీ గణనీయంగా పెరిగిపోయాయి...
ప్రజల సొత్తును నెలకు రూ.90 వేలు జీతంగా తీసుకుంటున్న ఎంపీడీఓలు ఎమ్మెల్యే, వైసీపీ నేతల అనుమతి లేనిదే పంచాయతీ కుళాయి కనెక్షన్లు ఇవ్వలేని పరిస్థితి కొనసాగుతోంది..
కొందరు అధికారులు వైసీపీకి తొత్తులుగా మారి అవినీతిలో మునిగితేలుతూ ప్రజలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు..కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారు...
ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా తిరుపతి ఎన్నికల ఫలితాన్ని తెచ్చుకునే బాధ్యత మనందరిపై ఉంది..
కేంద్ర మంత్రిగా పనిచేసి, మచ్చలేని నాయకురాలిగా పేరుతెచ్చుకున్న పనబాక లక్ష్మిని ఎంపీగా గెలిపించుకుందాం..
పత్తిపాటి పుల్లారావు కామెంట్స్
విధ్వంసం, వినాశకం, అవినీతి, అక్రమాలు, దోపిడీనే ధ్యేయంగా వైసీపీ పాలన సాగుతోంది..
ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలిచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు..
వైసీపీకి ఓటేసిన వారు కూడా ఈ రోజు పాలన చూసి విరక్తిచెందిన పరిస్థితి నెలకొంది...
వైసీపీ రెండో సారి అధికారంలోకి రావడం అసంభవం..
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్లో మార్పు తెచ్చేందుకు, వైసీపీ నేతల భ్రమలను తొలగించేందుకు తిరుపతి ఉప ఎన్నిక ఫలితం దోహదం చేస్తుంది..
తిరుపతి ఎంపీగా పనబాక లక్ష్మిని గెలిపించుకుని చరిత్ర తిరగరాద్దాం...
నరసింహ యాదవ్ కామెంట్స్
ఏ ఘటన జరిగినా నోరువిప్పని ముఖ్యమంత్రి ఎవరైనా దేశంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరే..
లక్షలాది మంది పేదల రేషన్ కార్డులు తొలగిస్తున్న ఘనత కూడా ఈ ప్రభుత్వానిదే..
రాష్ట్రంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పలకడం తిరుపతి నుంచే ప్రారంభం కావాలి..
నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు బుధవారం రాత్రి
దరఖాస్తులను బ్యాంకర్లు తిరస్కరించరాదన్నారు. బ్యాంకు ఆర్.ఎం. లు, కంట్రోలర్లతో సమావేశం నిర్వహించాలని.., ప్రభుత్వ సంక్షేమ పథకాలపై బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని చేయాలన్నారు.
ఈ సమీక్ష, సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి, ఇంచార్జి జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, మెప్మా పి.డి., అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.