ఉచిత వైద్య సేవలు అందిస్తున్న వైద్య బృందం. 

నారాయణ ఉచిత దంత వైద్య శిబిరానికి...కొత్తపల్లి సహకారం.  




 ముత్తుకూరు, ఫిబ్రవరి 6 ( మేజర్ న్యూస్) నారాయణ దంత వైద్యశాల గురువారం నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరానికి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు, బ్రాహ్మణ సంఘం నాయకులు, మాజీ సర్పంచ్ కొత్తపల్లి రమేష్ కుమార్ సహకారం అందించారు. గురువారం బ్రహ్మదేవం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల నందు నారాయణ దంత వైద్యశాల ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా దంతాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు ఉచితంగా ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. దంతాలు చూపించుకున్న వారికి పళ్ళు శుభ్రం చేయడం, అదేవిధంగాపళ్ళకు  సిమెంటు పెట్టడం లాంటి వైద్య సదుపాయాలను నారాయణ దంత హాస్పిటల్ వైద్యులు కల్పించారు. అనంతరం వైద్య శిబిరాన్ని ఉద్దేశించి అధికార పార్టీ నాయకులు కొత్తపల్లి ప్రసంగించారు. గ్రామస్థులకు పైసా ఖర్చు లేకుండా హాస్పిటల్ యాజమాన్యం దంత వైద్యం అందించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆయన పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులు బొబ్బేపల్లి అంకయ్య, కలికి మధుసూదన్ రెడ్డి, చింతా సుబ్బారామిరెడ్డి, దువ్వూరు ప్రభాకర్ రెడ్డి, మారుబోయిన వెంకటరమణయ్య, పసుపులేటి లక్ష్మి ప్రసాద్, గోలి రాము, బద్రి, నెట్ట్రాంబాక రాంమోహన్, మారుబోయిన గోపాలయ్య. మారుబోయిన ప్రసాద్, ఉప్పల ప్రసాద్, మేకల పెంచలయ్య, మారుబోయిన రవి షేక్ అబ్దుల్ ఖాదర్ , మారుబోయిన జయరామయ్య, వలిపి వెంకటేశ్వర్లు, మంగపతి శంకరయ్య ,తదితరులు పాల్గొన్నారు.