సూళ్లూరుపేట నగర శివారులో భారీగా ఇసుక డంపింగ్.
సూళ్లూరుపేట నగర శివారులో భారీగా ఇసుక డంపింగ్.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు గండి కొడుతున్న అధికారులు, ఇసుక మాఫియా.
నగర శివారులో సుమారు 70 ట్రాక్టర్ల పైనే ఇసుక డంపింగ్ చేసి ఉంచిన స్మగ్లర్లు.
ఇసుక డంపింగ్ ను గమనించిన గ్రామాధికారి
పై అధికారులకు సమాచారాన్ని అందించినా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
విలేకరులు వెళ్లి ఆ అధికారికి సమాచారం అందించిన వెంటనే హడవాడి చేసిన అధికారి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ఇసుకపాలసీని తుంగలో తొక్కుతున్న సూళ్లూరుపేట ప్రభుత్వ అధికారులు.
ప్రతిరోజు రాత్రి పగలు తేడా లేకుండా కాల్లంగి నది నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఇసుక మాఫియా.
ఇసుక మాఫియా కు అనుకూలంగా ఉన్నచోట డంప్ చేసి రాత్రి సమయంలో లారీలకు ఎత్తి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ఇసుక మాఫియా.
రవి కిరణాలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
పట్టణంలోని కె ఆర్ పి కాలనీ పక్కన ఉన్న ఓ లేఔట్ లో భారీగా నిల్వ ఉంచిన అక్రమ ఇసుక డంపింగ్ బయట పడింది, ఇసుక మాఫియా పట్టణ శివారు ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ఇసుకను డంప్ చేసి రాత్రి సమయంలో లారీలలో పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఈ లేఔట్ లో అక్రమార్కులు సుమారు 70 ట్రాక్టర్ ల ఇసుక డంపింగ్ చేసి ఉన్నారు, అక్రమ ఇసుక రవాణాకు ప్రభుత్వం కొరడా జులిపిస్తున్న క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది. సూళ్లూరుపేట ప్రాంతంలో ఇసుక, మట్టి, గ్రావెల్, మద్యం అక్రమంగా తరలించేందుకు అధికారులు అండదండలు తోనే మాఫియా చెలరేగుతుందని విమర్శలు వెలుగుతున్నాయి. ప్రధానంగా ఇసుక సూరులు అధికారులు అండను ఆసరాగా చేసుకొని అక్రమంగా నీటి వనరులను కొల్లగొడుతూ ఇసుక రవాణా చేపడుతున్నారు విమర్శలు ఉన్నాయి. పార్టీలకి అతీతంగా కూడా కొంతమంది టిడిపి చోటా నాయకుల కనుసన్నాల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం. ప్రభుత్వ అధికారులు అక్రమార్కులపై నిఘా ఉంచి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతలను మరచి చోద్యం చూస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇకనైనా అధికారులు నిద్ర మత్తును వీడి ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు..