మర్రిపాడు ఎస్సై ఘటనపై స్పందించిన జిల్లా టీడీపీ సోమిరెడ్డి, బీద ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం
మర్రిపాడు ఎస్సై ఘటనపై స్పందించిన జిల్లా టీడీపీ
సోమిరెడ్డి, బీద ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం
ఎస్సై వెంకటరమణ ఎందుకు చర్యలు తీసుకోవడంలో లేదో జిల్లా ఎస్పీ చెప్పాలి
ఎస్సై పై చర్యలకు ఛలో మర్రిపాడు కు పిలుపు \\ ఎస్సై వెంకట రమణ ను సస్పెండ్ చేయాలి: టిడిపి
లేకపోతే ఉద్యమాలు ఉదృతం \\ తీరు మార్చుకొనిఎస్సై వెంకట రమణ పనిచేసే ప్రతీ చోట వివాదాలు,కేసులు నమోదు\\ ఎస్సై వెంకట రమణ పై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదు \\ మర్రిపాడు టీడీపీ కన్వీనర్ పై దురుసుగా ప్రవర్తించిన ఎస్సై
\\ మర్రిపాడు ముంబయి జాతీయ రహదారిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు బైఠాయింపు
\\ ఉదృత పరిస్థితులు నడుమ మర్రిపాడు ఈ నెల 23 న ఛలో మర్రిపాడు
ఎస్సై వెంకటరమణ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గామారుతున్నారు, 2011 లో విధుల్లో చేరిన వెంకట రమణ వెంకటగిరి, శ్రీహరికోట,కోట,నాయుడుపేట,పెళ్లకూరు, నెల్లూరు3, 5 వ పట్టణం, బిట్ర గుంట, కోవూరు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు,ఎక్కడ కూడా పట్టుమని 6 నెలలు కూడావిధులునిర్వహించలేదు, పిర్యాదు దారులు, నేతలు, ప్రముఖుల పట్ల అనుచితంగాప్రవర్తించడంకొట్టడం,అసభ్యకరంగా దూషించడంపట్లవివాదాలుచోటుచేసుకోవడంతో బాధితులు పిర్యాదులతో కేసుల్లో ఇరుకోవడం, వి ఆర్ కి వెళ్లడం పరిపాటిగా మారింది.
ఈ నేపథ్యంలో ఆయన సొంత ఊరు తుళ్ళూరులో ఓ కేసులో ఇరుక్కుని డిజిపి రేంజ్ వి ఆర్ లో ఉన్నారు, ఆ తరువాత నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో వి ఆర్ లో ఉన్న నేపథ్యంలో ఇటీవల కొద్దీ రోజుల క్రితం జిల్లా ఎస్పీ విజయరావు ఎస్సై ల బదిలీలల్లో వి ఆర్ లో ఉన్న ఎస్సైలకు పోస్టింగ్ ఇచ్చారు, అందులో భాగంగా ఎస్సై వెంకట రమణ ను మర్రిపాడు ఎస్సై గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు, విధుల్లో చేరిన ఎస్సై వెంకట రమణ సోమవారం మర్రిపాడు టీడీపీ మండల కన్వీనర్ పై అనుచితంగా ప్రవర్తించడంతో మండలం లోని టీడీపీ నేతలు, కార్యకర్తలు మర్రిపాడు ముంబయి జాతీయ రహదారిపై బైఠాయించి ఎస్సై ను సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు.
ఆందోళన ఉదృతం కావడంతో డిఎస్పీ, సి ఐ లు సంఘటన స్థలానికి చేరుకొని ఎస్సై పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు,కానీ ఎస్సై పై చర్యలు తీసుకోకపోవడంతో మంగళవారం జిల్లా టీడీపీ అధిష్టానం స్పందించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆధ్వర్యంలో నెల్లూరు నగరం లోని ఎన్టీఆర్ భవన్ లో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, మాజీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి , నెల్లూరు నగర నియోజకవర్గ ఇంచార్జీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్ళపాక అనురాధ అత్యవసర సమావేశం నిర్వహించారు.
మర్రిపాడు ఘటన విషయం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెంనాయుడుతో చర్చించారు, ఉద్యమాన్ని తీవ్రం చేయాలని నిర్ణయించి 23 వ తేదీ ఛలో మర్రిపాడు కు పిలుపునిచ్చారు,ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూమర్రిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జనార్ధన్ నాయుడు, ఆయన తల్లితండ్రులను, కుటుంబ సబ్యులను సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ( గబ్బర్ సింగ్ ) నిష్కారణంగా నీచమైన భాష తో దూషించడాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు అనీ ఆగ్రహం వ్యక్తంచేశారు, మర్రిపాడు టీడీపీ కన్వీనర్ జనార్ధన్ నాయుడు పై దాడి చేసి, అతన్ని మానసికంగా ఆవేదనకు గురి చేసిన సబ్ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, సోమవారం స్థానిక ప్రజలు వందలాది మంది రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేసిన అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలి అని కోరారు.
స్థానిక ప్రజలు నిరసన తెలిపినా, ఉద్యమించినా ఇప్పటి వరకు సబ్ ఇన్స్పెక్టర్ పై చర్యలు లేకపోవడం హేయమైన చర్య అన్నారు, గతంలోజిల్లా లో విధులు నిర్వర్తించిన ప్రతీ చోట వివాదాలే పని గా పెట్టుకుని, వివాదాల ఎస్సై గా పేరు గాంచిన వెంకటరమణ ( గబ్బర్ సింగ్ ) పై చర్యలు తీసుకోకపోవడాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు,ఎస్సై పైచర్యలుతీసుకోకపోవడాన్ని నిరసిస్తూ, అతని పై వెంటనేచర్యలుతీసుకోవాలని డిమాండ్ చేస్తూ చలో - మర్రిపాడుకార్యక్రమానికి జిల్లా టీడీపీ పిలుపు నివ్వడం జరిగింది అని ఆయన చెప్పారు. ఛలో మర్రిపాడు కు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా కదలి రావాలని పిలుపునిచ్చారు