వివాహిత బలవన్మరణం

రవి కిరణాలు, తిరుపతి జిల్లా, నాయుడుపేట :-

పట్టణంలోని పిచ్చిరెడ్డి తోపులో చిల్లకూరు సునీల్ అతని భార్య నయనశ్రీ కొంతకాలంగా నివాసం ఉంటున్నారు.

 గురువారం సాయంత్రం నయన శ్రీ తను ఉంటున్న నివాసంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

సమాచారం అందుకున్న నాయుడుపేట సిఐ నరసింహారావు, ఎస్సై వేణుగోపాల్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి

పంచనామా నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు మృతురాలు భర్త సునీల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి

ఆత్మహత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలసులు తెలిపారు.