కోట మండలం చంద్రశేఖర పురం గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు.. వివరాల మేరకు కోట మండలం మడ్డలి గ్రామానికి చెందిన ఓ ఆటో విద్యానగర్ నుంచి మడ్డలి వెళ్తుండగా విద్యానగర్ వద్ద ఎక్కిన ఓ వ్యక్తి ఉనుగుంటపాళె0 మైక్రో టవర్ కాలనీ వరకు వద్ద డిగేలా ఆటో డ్రైవర్ కు సూచించాడు.. అయితే విద్యానగర్ నుంచి బయలుదేరిన ఆటో చంద్రశేఖర పురం గ్రామ సమీపంకు రాగానే అకస్మాత్తుగా వచ్చిన అడవి పందిని తప్పించబోయి ఆటో బోల్తా పడిండింది.. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఆటోలోని ప్రయాణికుడిని కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అప్పటికే క్షతగాత్రుడు మరణించినట్లు వైద్యులు సూచించారు.. విషయం తెలుసుకున్న పోలీసులు మృతిని వివరాలను సేకరిస్తున్నారు...