కాళ్లంగి నదిలో దిగి వ్యక్తి మృతి.
 
తిరుపతి జిల్లా. సూళ్లూరుపేట :-  పట్టణంలోని  చెంగాళమ్మ ఆలయం సమీపం లో ఉన్న కాళంగి నది కి దక్షిణం వైపు ఒడ్డు స్త్నానం కోసం దిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది వివరాల మేరకు  ఇక్కడ తరచూ నీటమునిగి గల్లంతు అవుతున్నవారి సంఖ్య పెరిగిపోతుందని,నేడు కూడా చిల్లకూరు మండలం వలిపేడు గ్రామానికి
చెందిన పోలుబోయిన సుబ్బారాయులు (40 ) అనే వ్యక్తి స్నాననం చేయడానికి నది లోకి
దిగి గల్లంతు కావడం జరిగింది, తరచూ ఇదే చోట నీటమునిగి గల్లంతు కావడం తో ఇక్కడ
డేంజర్ పాయింటుగా మారిందని  నదిలోకి దిగే దక్షిణం వైపు దారిని పూర్తిగా ముళ్ల కంచాలు వేసి మూసివేయాలని సంబంధిత అధికారులను కోరారు. నీట మునిగి గల్లంతైన వ్యక్తి కోసం  గాలింపు చర్యలు చేపట్టగా  ఉదయం 11 గంటల సమయంలో పోలుబోయిన సుబ్బారాయుడు మృతదేహం లభ్యమయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సూళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.