అధికారుల సహాయంతో దగదర్తి మండలం అభివృద్ధి సాధ్యం అంటున్న మాలేపాటి.





కావలి మేజర్ న్యూస్: కావలి నియోజకవర్గం దగదర్తి మండలంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డే లో రెవెన్యూ కార్యాలయం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజలు అధిక సంఖ్యలో వారి వారి సమస్యలపై కార్యాలయాలకు హాజరయ్యారు. వారి సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలే పార్టీ సుబ్బానాయుడు చొరవ తీసుకొని మండల రెవెన్యూ మరియు మండల పరిషత్ కార్యాలయంలో జరిగే టెలికాన్ఫరెన్స్కు హాజరై అధికారులతో హెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. రెవెన్యూపరమైన సమస్యలు పట్టా పాస్ పుస్తకాలు, అడంగల్ కాపీలు వంటి వాటిపై తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద పనులు చేపట్టి దగదర్తి మండలంలో అభివృద్ధికి సహకరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సుబ్బానాయుడు వెంట అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు. అంతేకాకుండా గ్రీవెన్స్ డే లో హాజరైన ప్రతి అర్జీదారునికి వారి గృహమునందు భోజన ఏర్పాట్లను చేసి వారితో కలిసి కూడా భోజనం చేయడం, అక్కడికి వచ్చిన అర్జీదారుల్లో వీరు ప్రజలకు చేస్తున్న సర్వీస్ని,  భోజనాలు ఏర్పాటు చేస్తున్న వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి, హర్షం వ్యక్తం చేస్తున్నారు.