సచివాలయాల వద్ద జరిగే నిరసన జయప్రదం చెయ్యండి

 పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల తగ్గించాలని ఏప్రిల్ 25వ తేదీ వామపక్షాల ఆధ్వర్యంలో సచివాలయాల వద్ద జరగనున్న నిరసనను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు  సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని అన్నారు. ఫలితంగా నిత్యావసర సరుకులు ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కరోనాతో అతలాకుతలమైన కుటుంబాలపై ఈ ధరల పెరుగుదల గోరుచుట్టుపై రోకలి పోటుల మారిందని అన్నారు. పెరుగుతున్న ధరల తగ్గింపుకై జరుగుతున్న పోరాటంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని, పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యనారాయణ, చేవూరి కొండయ్య, పసుపులేటి మహేష్, సీపీఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు కరవది భాస్కర్, సీపీఐ ఎంఎల్  నాయకులు లక్ష్మీరెడ్డి, స్త్రీ విముక్తి  సంఘటన నాయకురాలు శ్యామల, తదితరులు పాల్గొన్నారు.