ఇన్సాఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

 8జీడీఆర్1 - మాట్లాడుతున్న ఇన్సాఫ్ కమిటీ జిల్లా అధ్యక్షులు


గూడూరు : ఈ నెల 17న నిర్వహించనున్న ఇన్సాఫ్ కమిటీ జిల్లా మహా సభలను గూడూరులోని షాదీమంజిల్ లో నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా తన్జీమ్ ఏ ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు అజీజ్ అహ్మద్ అన్నారు. శుక్రవారం గూడూరు పట్టణంలోని షాదీమంజిల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలో నిర్వహించనున్న జిల్లా మహాసభలకు ఇన్సాఫ్ కమిటీ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, రాష్ట్ర కన్వీనర్ అప్సర్, జాయతీయ స్థాయి నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇన్సాఫ్ కమిటీ గౌరవాధ్యక్షులు షేక్. కాలేషా మాట్లాడుతూ మహాసభలకు మైనారిటీ నాయకులు, ముస్లిం సోదరులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఇన్సాఫ్ కమిటీ గూడూరు డివిజన్ అధ్యక్షులు షేక్. జమాలుల్లా మాట్లాడుతూ ఇన్సాఫ్ కమిటీ మహాసభలలో భాగంగా కరోనా సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించిన  మైనారిటీ సంస్థల నిర్వాహకులను సేవా పురస్కారం, ప్రసంశాపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. మాజీ ఎంపీ, హైదరాబాద్ మాజీ ఎంపీ, ఇన్సాఫ్ కమిటీ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా, రాష్ట్ర కన్వీనర్ అప్సర్ ఈ మహాసభలకు  హాజరుకానున్నట్లు తెలిపారు. ముస్లింల సమస్యలు, హక్కులు తదితర అంశాలపై ఉపన్యసిస్తారని తెలిపారు. ఈ మహాసభలలోనే జిల్లా కమిటీ ఎంపిక ఉంటుందన్నారు. జిల్లాలోని 46 మండలాలలో నూతన కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఇన్సాఫ్ కమిటీ గూడూరు డివిజన్ సలహాదారులు ఎండీ. అన్వర్ బాష, నియోజకవర్గ అధ్యక్షులు షేక్. హాషిం, షేక్. చాన్ బాష, సిరాజ్, నయూమ్, హసన్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.