ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.




ఉదయగిరి మేజర్ న్యూస్.

స్థానిక మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల లో గురువారం వాల్మీకి మహర్షి జయంతి వేడుక లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  మహర్షి వాల్మీకి చిత్రపటానికి అసోసియేట్ డీన్ డాక్టర్ జి కృష్ణారెడ్డి  పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అసోసియేట్ డీన్ అధ్యక్షత వహించి మహర్షి వాల్మీకి గురించి విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, వాల్మీకి సాహిత్యంలో పేరు ఎన్నిక గల కవి, రామ రామ అని తపస్సు చేసిన వారు మహర్షి. అలాగే రాముడు జీవిత చరిత్రను రామాయణముగా వ్రాశాడని, ఈయనను సంస్కృత భాషకు ఆదికవిగా గుర్తించారని, వాల్మీకి రామాయణమును తెలుగు అనువాదము కీర్తిశేషులు పురిపండా అప్పలస్వామి వాల్మీకిగా పిలవబడుతున్న మహర్షి పేరు రత్నాకరుడు ,అలాగే వాల్మీకి రాసిన రామాయణం అంటే భారతీయులకు అత్యంత విశ్వాసమని వివరించారు. రామాయణం వాల్మీకిచే వ్రాయబడి 24,000 శ్లోకాలు మరియు ఏడు ఖండాలు (కణాలు) ఉన్నాయని దాదాపు రామాయణం 4,80,002 పదాలతో రూపొందించబడిందని వివరించారు .ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం అధికారులు  డాక్టర్ జి రమేష్ ,డాక్టర్ దుర్గాప్రసాద్ ,సీనియర్ ప్రొఫెసర్లు డాక్టర్ గోపికృష్ణ  మరియు  బోధనేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.