మహాకుంభాభిషేకంలో పాల్గొన్న మంత్రి పి.అనీల్
నెల్లూరు : నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట నందు గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరిగిన మహాకుంభాభిషేకం కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముక్కాల ద్వారకనాథ్, కొండ్రెడ్డి రంగారెడ్డి, శ్రీరాం సురేష్, మంచికంటి శ్రీనివాసులు, దేవస్థాన కమిటీ సభ్యులు, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు, తదితరులు పాల్గొన్నారు.