ఘనంగా  చెంగాళమ్మ ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం.

రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-

కాలంగి నది ఒడ్డున వెలసి ఉన్న తెలుగు తమిళ ఆరాధ్య దైవం భక్తులకు బంగారం దక్షిణముఖ కాళీ భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీశ్రీశ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు బుధవారం నుండి శుక్రవారం వరకు జరుగు  సువర్ణ గోపుర శిఖర ప్రతిష్ట, మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం ఆలయంలో శిఖర గోపురాలపై ఏర్పాటు చేసే పలు సువర్ణ గోపుర కళశాలకు వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సువర్ణ గోపురం కు బంగారు తాపడానికి దాతలు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి దంపతులు విచ్చేశారు వీరిని స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి ఆలయ ఈవో ఆల శ్రీనివాసులురెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సువర్ణ కలశాల పూజా కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతి దంపతులు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి దంపతులు ఆలయ ఈవో ఆల శ్రీనివాసులు రెడ్డి దంపతులు, కళత్తూరు రామ్మోహన్ రెడ్డి, ఆలయ పాలక మండలి సభ్యులు కలిసి సువర్ణ కలశాలను తీసుకెళ్లి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్ఛారణతో ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. చెంగాలమ్మ ఆలయంలో గోపురానికి బంగారు తాపడం నిర్వహించి మొట్టమొదటిగా మహా కుంభాభిషేకం నిర్వహించడంతో మొదటిరోజు ఆలయంలో భక్తుల సందడి నెలకొన్నది. ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేశారు దీంతో ఆలయానికి విచ్చేసిన భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృప కటాక్షం పొంది ఆనందం వ్యక్తం  చేశారు.