సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో మహా జనసభ




తోటపల్లి గూడూరు మేజర్ న్యూస్ మండలంలోని పేడూరు సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో,బుధవారం మహాజనసభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సహకార బ్యాంక్ ఆఫీసర్ గురప్ప హాజరైనారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేడూరు సొసైటీ లాభాల బాటలో నడుస్తూ కంప్యూటరైజేషన్ దిశగా అన్ని వసతులు, అక్టోబర్ 2 నాటికి సమకూర్తాయని తెలిపారు. రైతులు తమ గ్రామంలో గిడ్డంగి నిర్మాణం కోరారని అందుకు అనువైన స్థలం దొరికిన వెంటనే నిర్మాణం చేపడుతామన్నారు,మండల వ్యవసాయాధికారి శిరీష రాణి తన సందేశంలో 

రసాయనిక ఎరువులు తగ్గించుకొని జీవన ఎరువులు వాడాలని సూచించారు.ఇఫ్కో ప్రతినిధి లక్ష్మీనారాయణ 

నానో యూరియా ప్రాధాన్యత ఇన్సూరెన్స్ 

సదుపాయాలు వివరించారు. సభ్యులు కోరిన సూచనలు అధికారులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంక్ ప్రతినిధులు, రవి ప్రకాష్, మోహన కృష్ణ, శివకుమార్, కళ్యాణ చక్రవర్తి, సీఈవో రమణమూర్తి,సొసైటీ సభ్యులు సోమిరెడ్డి రేవంత్ రెడ్డి,పోతన,సోమశేఖర్ రెడ్డి. దేవుళ్ళ 

శ్రీనివాసుల రెడ్డి, నారాయణ మొద్దు శ్రీనివాసులు, పోతన తదితర సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.