వైభవంగా చెంగాలమ్మ ఆలయంలో మహా కుంభాభిషేక వేడుకలు
రెండవ రోజు వైభవంగా చెంగాలమ్మ ఆలయంలో మహా కుంభాభిషేక వేడుకలు.
ఆలయం అంతా పచ్చని తోరణాలు.
వేడుకల్లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి దంపతులు, ఎమ్మెల్యే కిలివేటి.
కుంకుమార్చనలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట. ఫిబ్రవరి 23 (రవి కిరణాలు):-
సూళ్లూరుపేట పట్టణంలో వెలసి ఉన్న తెలుగు తమిళ ఆరాధ్య దైవం శ్రీ చెంగాలమ్మ ఆలయంలో నూతన స్వర్ణ విమాన గోపుర ప్రతిష్ట రెండవ రోజు మహా కుంభాభిషేక వేడుకల్లో భాగంగా ఆలయ చైర్మన్ దూరు బాలచంద్రారెడ్డి, ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కుంభాభిషేక వేడుకల్లో ఉభయ దాతలు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి - ప్రశాంతి రెడ్డి దంపతులు స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి దంపతులు, ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొన్నారు. ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో ఏర్పాటు చేసినటువంటి
యాగశాల లో పూజలు నిర్వహించారు.
ఆలయమంతా అరటి మానులు,మామిడాకులు తో పచ్చని తోరణాలు కట్టడంతో ఆలయంలో పండుగ వాతావరణం ఏర్పడింది. ఈ పూజల్లో ముందుగా యాగశాలలో పూజలు చేసిన అనంతరం లక్షకుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు.అనంతరం 16 శిఖర కలిశాలకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు.
ఈ వేడుకల్లో ఆలయ ట్రస్ట్ సభ్యులు ముప్పాళ్ల చంద్రశేఖర్ రెడ్డి,వంకా దినేష్,కర్లపూడి సురేష్,బండి సునీత,ఓలేటి బాలసత్యనారాయణ,మన్నెముద్దు పద్మజ,నాయుడు కుప్పం నాగమణి,తదితరులు పాల్గొన్నారు.