నేదురుమల్లిని కలిసిన ఎన్ బి కె ఆర్ ఎయిడెడ్ ఉద్యోగులు 

 ఎన్ బి కె ఆర్ఎయిడెడ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు 

129 వాగ్దానాలు చేస్తే వాటిలో 107 పూర్తిచేసిన సియం జగన్: నేదురుమల్లి 

జగనన్న పాలకుడు కాదు.. సేవకుడు 

 రాష్ట్రంలోప్రజారంజక పాలన సాగుతోంది 

తిరుపతి బాపట్ల పార్లమెంటు వైసీపీ నియోజకవర్గ పరిశీలకులు  నేదురుమల్లి  రాంకుమార్ రెడ్డి 

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినమాటనునిలబెట్టుకున్న పాలన ముఖ్యమంత్రి జగన్‌దని తిరుపతి బాపట్ల పార్లమెంటువైసీపీనియోజకవర్గ పరిశీలకులునేదురుమల్లి  రాంకుమార్ రెడ్డి అన్నారు. ఎన్ బి కె ఆర్ సైన్స్& ఆర్ట్స్ కళాశాలోఎయిడెడ్ఉద్యోగుల గా పనిచేస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులగా మార్చడంతో  మంగళవారం వాకాడులోని నేదురుమల్లిస్వగృహంలోనేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఎన్ బి కె ఆర్ ఉద్యోగస్తులు మర్యాద పూర్వకంగాకలిసిరాంకుమార్ రెడ్డికి శాలువాలు కప్పి పుష్ప గుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించి కృతజ్ఞతలుతెలియజేశారు. 


 ఈసందర్భంగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పాలన ముఖ్యమంత్రి జగన్‌దని  అన్నారు. రెండు ఏళ్ళ లో ‘129 వాగ్దానాలు చేస్తే వాటిలో 107 పూర్తిచేశారు. మరో 14 అమల్లో ఉన్నాయి. మిగిలిన కేవలం8వాగ్దానాలు వచ్చే మూడేళ్లలో చేయాల్సి ఉంది.2014లోఅధికారంలోకొచ్చిన తెదేపా, ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఆన్‌లైన్‌లో కనిపించకుండా దాచేసింది. 2019వరకూ ఉన్న అలాంటి రాజకీయ వ్యవస్థను ఈ రెండేళ్లలో జగన్‌ మార్చిచూపించారు. ప్రతిపక్షనేతచంద్రబాబుచరిత్రముగిసిపోయింది. ఆయన విమర్శలనుపట్టించుకోనవసరంలేదు’అనివ్యాఖ్యానించారు. 

 పాలకుడు కాదు.. సేవకుడు 

 ఖాళీ ఖజానా, అస్తవ్యస్తమైన పాలన, అన్ని రంగాల్లోనూ అవినీతి.. ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేసేనాటికి ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఇలా అగమ్యగోచరంగా ఉంది. అయినా వెరవలేదు. తొలి అడుగే సంక్షేమ సంతకం. నాటి నుంచి వడివడిగా అడుగులు పడుతూనే ఉన్నాయి. వరుసగా సంక్షేమ పథకాలు. అన్ని వర్గాలకు ఆలంబనగా కీలకమైన నిర్ణయాలు వెలువడుతూనే ఉన్నాయి. ఇది ఓర్వలేని ప్రతిపక్షాలు, పచ్చ మీడియా అంతా ఏకమై ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నా.. వాటన్నింటినీ తట్టుకున్నారు. కులం, మతం, ప్రాంతం చివరకు పార్టీ కూడా చూడలేదు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తూనే ఉన్నారు. తండ్రి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో పయనిస్తున్నారు అనీ రాంకుమార్ రెడ్డి  పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఎన్ బి కె ఆర్ ఉద్యోగులు,వైసీపీ నేతలు తదితరులు ఉన్నారు.