పలమనేరు, జనవరి 23, (రవికిరణాలు) : ఎంఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం ఫలితాలలో యూనివర్సిటీ స్థాయి 6వ ర్యాంక్ సాధించి అందరి మెప్పును పొందుతున్న వాణిని అభినందించాల్సిందే. రూరల్ మండలంలోని జంగాలపల్లె గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎల్ సుబ్రహ్మణ్యం కుమార్తె ఎస్ వాణి ప్రాధమిక పాఠశాల విద్య నుంచి చదువులో అత్యంత ప్రతిభను కనబరుస్తూ ముందుకు సాగుతోంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల లో చదివి 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యకు పలమనేరు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షతో పాటు 10వ తరగతి లోను అత్యధిక మార్కులు సాధించింది.10వ తరగతి మార్కులు ఆధారంగా వాణి మదనపల్లెలో ప్రభుత్వ సహకారం తరపున ఇంటర్ పూర్తి చేసింది.ఇలా ఇంటర్ మార్కులు ఆధారంగానే రాష్ట్రస్థాయి బీఎస్సీ మరియు ఎంఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్షలోనూ ప్రతిభ కనబరచడంతో ప్రభుత్వం నెల్లూరు నారాయణ కళాశాలలో సీటు కేటాయించిoది.ఇందులోభాగంగా తాజాగా వెలువడిన ఫలితాలలో 563 మార్కులు సాధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా మొదటి సంవత్సరం 6వ ర్యాంక్ సాధించింది. ఈ
సంధర్భంగా వాణి మాట్లాడుతూ ఎంఎస్సీ నర్సింగ్ కోర్స్ చివరి ఫలితాలలో యూనివర్సిటీ స్థాయిలో మొదటి ర్యాంక్ పొందనునట్టు తన ఆశాభావం వ్యక్తం చేశారు. దళిత వర్గానికి చెందిన ఎల్ సుబ్రహ్మణ్యం కుమార్తె వాణి యూనివర్సిటీ స్థాయిలో ర్యాంక్ సాధించడంతో తోటి జర్నలిస్ట్ లు ఆయనను అభినందించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.