నేషనల్ హైవే అధికారులతో ఎంపీ సమీక్ష
చిల్లకూరు మండలం తిప్పాగుంట పాలెం చెరువుకు పంబలేరు నుండి ఉన్న సప్లై ఛానల్ ను నేషనల్ హైవే వారు రోడ్డు డైవర్షన్ పనులు చేస్తూ కాలువ పూడ్చివేయాగ, తిప్పగుంటపళ్ళెం రెతులు ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు దృష్టికి తీసుకువెళ్లగా ఎంపీ స్పందించారు. నేషనల్ హైవే అధికారులను, నీటిపారుదల శాఖ అధికారులను, రైతులను తన కార్యాలయానికి పిలిపించుకుని సమీక్ష చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి బుధవారం నాడు అధికారులను పరిశీలించాలని ఆదేశించారు. రోడ్డు పని పూర్తయ్యేంత వరకు రైతులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. నివేదిక తయారు చేసినట్లు అయితే ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే, నీటిపారుదల శాఖ అధికారులతో పాటు నాయకులు వేమారెడ్డి మురళీ మోహన్ రెడ్డి, గూడూరు శ్రీనివాసులు రెడ్డి వాణిజ్య విభాగ కన్వీనర్ నందవారం సుబ్బారావు, రెతులు సనత్ రెడ్డి అశోక్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.