చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికిన ఎంపీ వేమిరెడ్డి




ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లిన వేమిరెడ్డి గారు.. చంద్రబాబు గారికి పుష్పగుచ్చమిచ్చి సత్కరించారు. అనంతరం ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు.