కేంద్ర బడ్జెట్ పై ఎంపీ వేమిరెడ్డి హర్షం
కేంద్ర బడ్జెట్ పై ఎంపీ వేమిరెడ్డి హర్షం
బడ్జెట్‌లో పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి పెద్దపీట
కేంద్రపద్దులో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరం, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
అన్ని వర్గాలకు సమన్యాయం చేసే ‘డ్రీమ్ బడ్జెట్’ ఇది.
వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్.. అన్ని వర్గాలకు సమన్యాయం చేసిందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు అన్నారు. శనివారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సహకార సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి బడ్జెట్ పెద్దపీట వేసిందని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత ఇన్ కమ్ టాక్స్ పరిధిని 12 లక్షలకు పెంచడం చాలా పెద్ద నిర్ణయమని, మధ్య తరగతి వర్గానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. MSMEలు, చిన్న పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ కేటాయింపును 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన జరుగుతుందన్నారు. అన్ని సంక్షేమ పథకాలకు నిధులను పెంచిన కేంద్ర ప్రభుత్వం, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో మరో అడుగు ముందుకేసిందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ గారికి, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ గారికి ధన్యవాదములు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత..
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దపీట వేయడంపై ఎంపీ వేమిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇవ్వడంపై ఎంపీ వేమిరెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టిన కూటమి ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలు రాష్ట్రానికి నిధులు రాబట్టేలా చేశాయని వ్యాఖ్యానించారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు, విశాఖ స్టీల్‌కు రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి రూ. 186 కోట్లు, ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ. 162 కోట్లు సహా.. లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్ కి మద్దతుగా రూ. 375 కోట్లు, ఏపీలో రోడ్లు, వంతెనల ప్రాజెక్టుకు రూ.240 కోట్లు సహా ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు 2వ దశకు రూ.242.50 కోట్లు కేటాయించడం సంతోషకర విషయమన్నారు.
అలాగే వికసిత్ భారత్ లక్ష్యాల్లో భాగంగా న్యూక్లియర్ ఎనర్జీ మిషన్‌తోపాటు భూ రికార్డుల డిజిటలైజేషన్‌కు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారని, తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి బడ్జెట్‌లో చేయూతనివ్వడం గొప్ప విషయమన్నారు. కొత్తగా నేషనల్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థను ప్రారంభిస్తూ.. మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించడం ద్వారా స్వావలంబన సాధించే అవకాశం ఉందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్ సేవలకు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారని, సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు బడ్జెట్‌లో అదనపు నిధులు కేటాయిస్తామని చెప్పడం విద్యకు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్థం అవుతోందన్నారు.